Wednesday, July 24, 2013

స్వరములు ఏడైనా

చిత్రం: తూర్పు పడమర (1976)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

స్వరములు ఏడైనా..  రాగాలెన్నో
హృదయం ఒక్కటైనా... భావాలెన్నో

అడుగులు రెండైనా నాట్యాలెన్నో
అక్షరాలు కొన్నైనా కావ్యాలు ఎన్నెన్నో

చరణం 1:

జననంలోన కలదు వేదన ..మరణంలోనూ కలదు వేదనా
జననంలోన కలదు వేదన ..మరణంలోనూ కలదు వేదనా
ఆ వేదనలోన ఉదయించే నవవేదాలెన్నో నాదాలెన్నెన్నో .. నాదాలెన్నెన్నో

చరణం 2:

నేటికి రేపొక తీరని ప్రశ్న ..
రేపటికి మరునాడొక ప్రశ్న
కాలమనే గాలానికి చిక్కీ ఆ ..ఆ
కాలమనే గాలానికి చిక్కి తేలని ప్రశ్నలు ఎన్నెన్నో.. ఎన్నెన్నో

చరణం 3:

కనులున్నందుకు కలలు తప్పవు .. కలలున్నపుడు పీడకలలు తప్పవు
కనులున్నందుకు కలలు తప్పవు .. కలలున్నపుడు పీడకలలు తప్పవు
కలల వెలుగులో కన్నీరొలికే ..
కలల వెలుగులో కన్నీరొలికే కలత నీడలు ఎన్నెన్నో 


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8004

No comments:

Post a Comment