Wednesday, July 24, 2013

ఏమిటిది ఏమిటిది

చిత్రం: తూర్పు వెళ్ళే రైలు (1979)

సంగీతం: బాలు

గీతరచయిత: ఆరుద్ర

నేపథ్య గానం: సుశీల


పల్లవి :


ఏమిటిది .. ఏమిటిది ..

ఏదో తెలియనిదీ..

ఎప్పుడూ కలగనిది.. ఏమిటిది


ఏమిటిది... ఏమిటిది ..

ఏదో తెలియనిదీ..

ఎప్పుడూ కలగనిది.. ఏమిటిది… 

ఏమిటిది… 



చరణం 1:


హత్తుకున్న మెత్తదనం కొత్తకొత్తగా ఉంది

మనసంతా మత్తుకమ్మి మంతరించినట్లుంది

నరనరాన మెరుపుతీగ నాట్యం చేసేస్తోంది

నాలో ఒక పూలతేనె నదిలా పొంగుతోంది… పొంగుతోంది

ఏమిటిది..



ఏమిటిది..ఏమిటిదీ



చరణం 2 :


ఈడు జోడు కుదిరింది.. తోడు నీడ దొరికింది..

అందానికి ఈనాడే అర్ధం తెలిసొచ్చింది

పెదవి వెనుక చిరునవ్వు దోబూచులాడింది..

చిలిపి చిలిపి తలపు తలచి సిగ్గు ముంచుకొస్తోంది..


ఏమిటిది…

ఏమిటిది... ఏమిటిది ..

ఏదో తెలియనిదీ..

ఎప్పుడూ కలగనిది కలకానిది..

ఏమిటిది…



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7251

No comments:

Post a Comment