Friday, July 26, 2013

చెలియ లేదు చెలిమి లేదు

చిత్రం: దేవదాసు (1953)
సంగీతం: సి.ఆర్. సుబ్బరామన్
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల, కె. రాణి

పల్లవి:

చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు
ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే ..
ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే .. మిగిలిందీ నీవేనే...

చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు

చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే
చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే
చేరదీసి సేవచేసే తీరూ కరువాయే..
చేరదీసి సేవచేసే తీరూ కరువాయే..నీ దారే వేరాయే...

చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే

చరణం 1:

మరపురానీ బాధకన్నా మధురమే లేదూ ..మరపురానీ బాధకన్నా మధురమే లేదూ
గతము తలచీ వగచేకన్నా సౌఖ్యమే లేదూ..గతము తలచీ వగచేకన్నా సౌఖ్యమే లేదూ
అందరానీ పొందుకన్నా అందమే లేదూ .. ఆనందమే లేదు

చరణం 2:

వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే ..వరదపాలౌ చెరువులైనా పొరలి పారేనే
రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే .. రగిలి పొగలు కొండలైనా పగిలి జారేనే
దారిలేని బాధతో నేనారిపోయేనా .. కథ తీరిపోయేనా

చెలిమీ పోయే చెలువూ పోయే నెలవే వేరాయే
ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే .. మిగిలిందీ నీవేనే


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1518

No comments:

Post a Comment