Wednesday, July 24, 2013

చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా

చిత్రం: తెనాలి రామకృష్ణ (1956) 
సంగీతం: విశ్వనాథన్- రామమూర్తి 
గీతరచయిత: సముద్రాల (సీనియర్) 
నేపధ్య గానం: ఘంటసాల 


పల్లవి: 

చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఆ ఆ ఆ ఈ కోటలో.. 
చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఈ కోటలో.. 
చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఈ కోటలో.. 
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ.. నీ మాట దక్కించుకో బాబయ 
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ.. నీ మాట దక్కించుకో బాబయా.. 
బాబయ... చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా వేసేయ్యి పాగా ఈ కోటలో.. 

చరణం 1: 

నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ... 
కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా... 
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
నాటేది ఒక్క మొక్క వేసేది నూరు కొమ్మ... 
కొమ్మ కొమ్మ విరగబూసి వేలాదిగా ... 
ఇక కాయాలి బంగారు కాయలు... భోంచేయ్యాలి మీ పిల్లకాయలు 
కాయాలి బంగారు కాయలు... భోంచేయ్యాలి మీ పిల్లకాయలు 
చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా ...వేసేయ్యి పాగా ఈ కోటలో 

చరణం 2: 

రహదారి వెంట మొక్కనాటి పెంచరా 
కలవాడు లేనివాడు నిన్ను తలచురా 
రహదారి వెంట మొక్కనాటి పెంచరా 
కలవాడు లేనివాడు నిన్ను తలచురా 

భువిని తరతరాల నీదు పేరు నిలుచురా 
పనిచేయువాడే ఫలములారగింతురా 

చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా... వేసేయ్యి పాగా ఈ కోటలో 
ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ... నీ మాట దక్కించుకో బాబయా 
బాబయా చేసేది ఏమిటో చేసెయ్యి సూటిగా... వేసేయ్యి పాగా ఈ కోటలో

1 comment:

  1. పర్యావరణ పరిరక్షణ అని ఇప్పుడు మొత్తుకుంటున్నాం
    వారు ఆనాడే ఎంతో శ్రావ్యంగా మనస్సుకు హత్తుకునేలా ప్రభావవంతంగా చెప్పారు. అప్పటి నుండే అనుసరించి ఉంటే ఈపాటికి ఎన్నో అడవులు నెలకొనేవి.Hats off to veterans.

    ReplyDelete