Friday, July 26, 2013

ఈ వీణకు శృతి లేదు

చిత్రం: దేశోద్ధారకులు (1973)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

ఈ వీణకు శృతి లేదు.. ఎందరికో హృదయం లేదు
నా పాటకు పల్లవి లేదూ.. ఈ బ్రతుకులెందులకో అర్థంకాదు..ఊ

ఈ వీణకు శృతి లేదు.. ఎందరికో హృదయం లేదు
నా పాటకు పల్లవి లేదూ.. ఈ బ్రతుకులెందులకో అర్థంకాదు..ఊ
ఈ వీణకు శృతి లేదు.. ఎందరికో హృదయం లేదు..

చరణం 1:

అందాన్ని వెలకట్టేవాళ్ళకు..అనురాగం వెలివేసినవాళ్ళకూ..
అందాన్ని వెలకట్టేవాళ్ళకు..అనురాగం వెలివేసినవాళ్ళకూ..

తెగిపోయిన తీగలు మీటేవాళ్ళకూ..ఊ..ఊ
నేనేమని చెప్పేదీ..ఈ..ఈ..ఏ పాటలు పాడేదీ..ఈ..ఈ..ఈ
అని కన్నీరొలికానూ..ఊ..ఆ కన్నీరంతా కాదూ
నా పాటకు పల్లవి లేదూ..ఈ బ్రతుకులెందుకో అర్థంకాదూ..

ఈ వీణకు శృతి లేదు.. ఎందరికో హృదయం లేదు..

చరణం 2:

అందరిలా పుట్టిన నేనూ..కొందరి ఆశకు బలి అయినాను..
అందరిలా పుట్టిన నేనూ..కొందరి ఆశకు బలి అయినాను..

నావలే ఎందరో ఉన్నారని తెలిసీ..ఇది ఎవరు చేసిందీ..ఈ..ఈ
ఏ దేవుడు రాసిందీ..ఈ..ఈ..ఈ
అని ఎలుగెత్తడిగానూ..ఊ..నా ప్రశ్నకు బదులే లేదూ..
నా ప్రశ్నకు బదులే లేదూ..ఈ బ్రతుకులెందుకో అర్థంకాదూ

ఈ వీణకు శృతి లేదు.. ఎందరికో హృదయం లేదు..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=236

No comments:

Post a Comment