Monday, July 22, 2013

బాగుందమ్మా బాగుంది

చిత్రం: టక్కరి దొంగ (2002)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: కులశేఖర్
నేపధ్య గానం: ఎస్.పి.చరణ్, ఉష

పల్లవి:

బాగుందమ్మా బాగుంది అమ్మాయి నీ ముద్దు
మళ్ళీ మళ్ళీ అంటాను అబ్బాయి చంపొద్దు
ఊయలల్లే ఊగే నీ నడుమే ముద్దు
హమ్మ హమ్మ హమ్మ సితం ఆగాలమ్మా

చరణం 1:

వెచ్చటి గుండెల చప్పుళ్ళో నా కంటి రెప్పల్లో
పదిలంగా ఉందోయమ్మ నీ రూపమే
పున్నమి వెన్నెల కాంతుల్లో ఆ మబ్బు డొంకల్లో
రేయంతా వెతికానమ్మా నీ కోసమే
అమ్మాయి బుగ్గల్లో మందారం మొగ్గల్లే దోబూచులాడుతున్న సిగ్గే ముద్దు
వద్దూ వద్దూ వద్దూ నను కవ్వించొద్దు మోమాటాలే వద్దూ గిలిగింతే వద్దు

చరణం 2:

ఉక్కిరి బిక్కిరి అవుతున్నా నేనెంత కాదన్నా
నీలోనే చేరిందమ్మా నా ఊపిరి
ఎప్పుడు ఎప్పుడు అనుకున్నా ఈ రోజే చూస్తున్నా
నాకెంతో నచ్చిందమ్మా నీ వైఖరి
ఛీ పాడు సిగ్గన్నా సూదంటు రాయల్లే కుచ్చెళ్ళు లాగేస్తున్న చూపే ముద్దు
ముద్దు ముద్దు ముద్దు నీ నడుమే ముద్దు విప్పద్దయ్యో నువ్వు మరి చికాకొద్దు 

No comments:

Post a Comment