Monday, July 22, 2013

నలుగురికి నచ్చినది

చిత్రం: టక్కరి దొంగ (2002)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: శంకర్ మహదేవన్

పల్లవి:

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో

 నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో 
నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో


పొగరని అందరు అన్నాఅది మాత్రం నా నైజం
తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం
నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు
నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు
నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు
నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో

చరణం 1:

నువ్వు నిలబడి నీళ్ళు తాగడం నథింగ్ స్పెషల్
పరుగులెత్తుతూ పాలూ తాగడం సంథింగ్ స్పెషల్
నిన్ను అడిగితే నిజం చెప్పడం నథింగ్ స్పెషల్
అప్పుడప్పుడు తప్పు చెప్పడం సంథింగ్ స్పెషల్
లేనివాడికి దానమివ్వడం నథింగ్ స్పెషల్
ఓ లేనివాడికి దానమివ్వడం నథింగ్ స్పెషల్
ఉన్నవాడిడి దోచుకెళ్ళడం సంథింగ్ స్పెషల్

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో

చరణం 2:

బుద్దిమంతుడి బ్రాండు దక్కడం నథింగ్ స్పెషల్
పోకిరోడిలా పేరుకెక్కడం సంథింగ్ స్పెషల్
రాజమార్గమున ముందుకెళ్ళడం నథింగ్ స్పెషల్
దొడ్డిదారిలో దూసుకెళ్ళడం సంథింగ్ స్పెషల్
హాయి కలిగితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్
హాయి కలిగితే నవ్వు చిందడం నథింగ్ స్పెషల్
బాధ కలిగినా నవ్వుతుండడం సంథింగ్ స్పెషల్

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో
నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో

పొగరని అందరు అన్నాఅది మాత్రం నా నైజం
తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం
నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు
నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు
నిండు చందురుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు
నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు

No comments:

Post a Comment