Thursday, July 25, 2013

శ్రీ గణపతిని సేవింప రారే

చిత్రం: త్యాగయ్య (1981) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: త్యాగయ్య 
నేపధ్య గానం: బాలు 

పల్లవి: 

శ్రీ గణపతిని సేవింప రారే శ్రిత మానవులారా 
వాగాధిపతి సు-పూజల చేకొని బాగా నతింపుచు వెడలిన 

చరణం 1: 

పనస నారికేలాది జంబూ ఫలముల 
నారగించి ఘన తరంబగు మహిపై పదములు 
ఘల్లు ఘల్లన నటయించి అన్యము హరి చరణ 
యుగములను హృదయాంబుజమున నుంచి 
వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ 
గతుల దిత్తళాంగుమని వెడలిన

1 comment:

  1. వినాయకచతుర్ధికి గానం చేయాల్సిన పాటలలో
    ఈ మంచి పాట ఒకటి. త్యాగరాజుకు త్రికర్మణా కృతజ్ఞతాసుమాంజలి.
    - కుసుమ కోణమానిని

    ReplyDelete