Thursday, August 1, 2013

లేఖా ఇది ఒక లేఖ

చిత్రం: నా మొగుడు నాకే సొంతం (1989) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
నేపధ్య గానం: బాలు 

పల్లవి: 

లేఖా.. ఇది ఒక లేఖ 
లేఖా.. ఇది ఒక లేఖ 
లేక లేక.. రాయలేక 
చేతకాక.. మనసు రాక 
రాసాను ఒక లేఖ.. 
కాదు.. ఇది ప్రేమలేఖ 

లేఖా.. ఇది ఒక లేఖ 
లేక లేక.. రాయలేక 
చేతకాక.. మనసు రాక 
రాసాను.. ఒక లేఖా 
కాదు.. ఇది ప్రేమలేఖ 

లేఖా.. ఇది ఒక లేఖా... 

చరణం 1: 

అమావాస్య చీకటికి.. పున్నమి వెన్నెల వెలుగు 
బీడు వారు భూమికి.. కురిసే వానలు బ్రతుకు 

అమావాస్య చీకటికి.. పున్నమి వెన్నెల వెలుగు 
బీడు వారు భూమికి.. కురిసే వానలు బ్రతుకు 


సుడిగాలిలోన అల్లాడుతున్న దీపానికి.. 
మేడకట్టి నీడనిచ్చి నింగి అంచున చేర్చిన.. దేవత 

పేరు పెట్టి పిలవలేక.. 
ఏమనాలో తెలియరాక.. 
రాసాను.. ఈ లేఖా.. ఆ.. ఆ.. 
కాదు.. ఇది ప్రేమలేఖ 
లేఖా.. ఇది ఒక లేఖా... 

చరణం 2: 

మనిషిలోని ఊపిరికి.. తల్లే మూలం దైవం 
మనసులోని ఊహలకు.. తండ్రే జ్ఞానం దైవం 

మనిషిలోని ఊపిరికి.. తల్లే మూలం దైవం 
మనసులోని ఊహలకు.. తండ్రే జ్ఞానం దైవం 

నడిసాగరాన చుక్కాని లేని.. ఓనావని 
దారినేర్పి దరికి చేర్చి.. తల్లిదండ్రుల మించిన దేవత 

పేరు పెట్టి పిలవలేక.. 
ఏమనాలో తెలియరాక.. 
రాసాను.. ఈ లేఖా...ఆ..ఆ 
కాదు.. ఇది ప్రేమలేఖ.. 

లేఖా.. ఇది ఒక లేఖా...


No comments:

Post a Comment