Wednesday, August 7, 2013

చిన్నారి నీ చిరునవ్వు

చిత్రం: పసిడి మనసులు (1970)
సంగీతం: అశ్వత్థామ
గీతరచయిత : ఉషశ్రీ
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి :

చిన్నారి నీ చిరునవ్వు...విరిసిన మల్లెపువ్వు
చిన్నారి నీ చిరునవ్వు...విరిసిన మల్లెపువ్వు
పొన్నారి నీ అందం...పూచిన పూడెందం
వోయలు గొలిపే వయసు...వలపులు చిలికే సొగసు
అందాల కాంతులీను...నీ మధుహాసం...

చరణం 1:

హ...హ..హ..
ఆ...ఆ...ఆ...ఆ..

వలపుల తోటలోనా...విహరించు నెరజాణ
వలపుల తోటలోనా...విహరించు నెరజాణ
అంతులేని ఆనందం...మీటెను హృదయవీణ...

చిన్నారి నీ చిరునవ్వు...విరిసిన మల్లెపువ్వు
పొన్నారి నీ అందం...పూచిన పూడెందం

చరణం 2 :

తోడుగా నీ ఉంటే...నీడగా నేనుంటే
వేడి వేడి వలపు...తీయనై తలపు
అలలా పొంగే వయసు...శిలలా చరగని సొగసు
అలలా పొంగే వయసు...శిలలా చరగని సొగసు
ఆశతో చూసిన మనసు...ఆగదులే...నాకు తెలుసు

చిన్నారి నీ చిరునవ్వు...విరిసిన మల్లెపువ్వు
పొన్నారి నీ అందం...పూచిన పూడెందం

2 comments: