Monday, August 5, 2013

మంచిని సమాధి చేస్తారా


చిత్రం: నేరం నాది కాదు ఆకలిది (1976)
సంగీతం: సత్యం
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు


పల్లవి :

మంచిని సమాధి చేస్తారా..
ఇది మనుషులు చేసే పని యేనా..
మనలో పాపం చేయని వాడు... ఎవడో చెప్పండి..
ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి..


మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా..

మనలో పాపం చేయని వాడు...  ఎవడో చెప్పండి..
ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి..


చరణం 1 :


కత్తితో చేధించనిది కరుణతో చేధించాలి.
కక్షతో కానిది క్షమాభిక్షతో సాధించాలి..

తెలిసీ తెలీయక కాలు జారితే....ఏ..ఏ..

తెలిసీ తెలియక కాలు జారితే... చేయూతనిచ్చి నిలపాలీ  

మనలో కాలు జారని వారు.. ఎవరో చెప్పండి..

లోపాలు లేని వారు.... ఎవరో చూపండి...

మంచిని సమాధి చేస్తారా..ఇది మనుషులు చేసే పనియేనా...
మనలో పాపం చేయని వాడు... ఎవడో చెప్పండి..

ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి..




చరణం 2 :



గుడులలో లింగాలను మింగే బడా భక్తులు కొందరు...
ముసుగులో మోసాలు చేసే మహా వ్యక్తులు కొందరు..

ఆకలి తీరక నేరం చేసే...ఏ..ఏ..

ఆకలి తీరక నేరం చేసే... అభాగ్యజీవులు కొందరూ 

మనలో నేరం చేయని వాడూ.... ఎవడో చెప్పండి..

ఏ దోషం లేని వాడు... ఎవడో చూపండి..

మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా...
మనలో పాపం చేయని వాడు... ఎవడో చెప్పండి..
ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి..



చరణం 3 :



తప్పు చేసిన ఈ దోషిని ఇప్పుడే శిక్షించాలి..
మరపురాని గుణపాఠం పదిమందిలో నేర్పించాలి..

హ హ హ.. ఐతే..


ఎన్నడు పాపం చేయని వాడు...ఊ...ఊ..ఊ

ఎన్నడు పాపం చేయని వాడు... ముందుగ రాయి విసరాలి...

మీలో పాపం చేయని వాడే... ఆ రాయి విసరాలి..

ఏ లోపం లేని వాడే... ఆ శిక్ష విధించాలి..



మంచిని సమాధి చేస్తారా.. ఇది మనుషులు చేసే పనియేనా..
మనలో పాపం చేయని వాడు... ఎవడో చెప్పండి..
 ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి..




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=290

No comments:

Post a Comment