Sunday, August 11, 2013

అమ్మా అని అరచినా


చిత్రం:  శ్రీ పాండురంగ మహత్యం (1957)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల


పల్లవి:

అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
    ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా
  
అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా
ఆవేదన తీరు రోజు ఈ జన్మకు లేదా 

చరణం 1:

    పదినెలలు నను మోసి పాలిచ్చి పెంచి
    మది రోయక నాకెన్నో ఊడిగాలు చేసినా
    ఓ తల్లీ నిన్ను నలుగురిలో నగుబాటు చేసితి
    తలచకమ్మ తనయుని తప్పులు క్షమియించవమ్మా
    అమ్మా ... అమ్మా ...

చరణం 2:

    దేహము.. విజ్ఞానము.. బ్రహ్మోపదేశమిచ్చి
    ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని
    కనుగానని కామమున ఇలువెడల నడిపితి
    కనిపిస్తే కన్నీళ్ళతో కాళ్ళు కడుగుతా నాన్నా
    నాన్నా ... నాన్నా ...

చరణం 3:

    మారిపోతినమ్మా నాగతి ఎరిగితినమ్మా
    నీమాట దాటనమ్మ ఒక మారు కనరమ్మా

    మాతా పిత పాద సేవే
    మాధవ సేవేయని మరువనమ్మా
    మాతా పిత పాద సేవే
    మాధవ సేవేయని మరువనమ్మా
    నన్ను మన్నించగ రారమ్మా

    ఏ పాదసీమ కాశీప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము
    ఏ పాదపూజ రమాపతి శరణాబ్జపూజలకన్ననూ పుణ్యతమము
    ఏ పాదతీర్ధము పాపసంతాపాగ్ని ఆర్పగా జారిన అమృతఝరమూ
    ఏ పాదస్మరణ నాగేంద్రశయను ధ్యానంబుకన్ననూ మహానందకరము

    అట్టి పితరుల పదసేవ ఆత్మ మరచి
    ఇహపరంబులకెడమై తపించువారి
    కావగలవారు లేరూ.. లేరు ఈ జగాన వేరే
    నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా! నాన్నా!
    ఆ ఆ ఆ అమ్మా! నాన్నా!

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5

No comments:

Post a Comment