Thursday, August 1, 2013

ఎవ్వరికోసం ఈ మందహాసం

చిత్రం: నర్తనశాల (1963)
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
గీతరచయిత: సముద్రాల (జూనియర్)
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే
సొగసరి ఒకపరి వివరించవే

చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతునో
గడుసరి ఏమని వివరింతునో

చరణం 1:

ఆ ఆ వలపులు చిలికే వగలాడి చూపు
పిలువక పిలిచి విరహాల రేపు

ఆ ఆ ఎదలో మెదలే చెలికానిరూపు
ఏవో తెలియని భావాల రేపు

ఈ నయగారం ప్రేమ సరాగం
ఈ నయగారం ప్రేమ సరాగం
అందించు అందరాని సంబరాలే 


ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే 
సొగసరి ఒకపరి వివరించవే 

చరణం 2:

ఆ ఆ పరుగులు తీసే జవరాలి వయసు
మెరుపై మెరిసి మరపించు మనసు

ఆ ఆ ప్రణయం చిందే సరసాల గంధం
ఇరువురి నొకటిగ పెనవేయు బంధం
ఈ వయ్యారం ఈ సింగారం
ఈ వయ్యారం ఈ సింగారం
చిందించుచిన్ని చిన్ని వన్నెలెన్నో


ఎవ్వరికోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే 
సొగసరి ఒకపరి వివరించవే 
చెలిమి కోసం చెలి మందహాసం ఏమని వివరింతునో 
గడుసరి ఏమని వివరింతునో 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2301

No comments:

Post a Comment