Tuesday, August 6, 2013

సిరిమల్లె పువ్వా

చిత్రం: పదహారేళ్ళ వయసు (1978)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపథ్య గానం: జానకి

పల్లవి:

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే

సిరిమల్లె పువ్వా... 

చరణం 1:

తెల్లరబోతుంటే నా కల్లోకి వస్తాడే
కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే
ఆ అందగాడు,నా ఈడు జోడు ఏడే
ఈ సందెకాడా నా సందమామ రాడే

చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా... 

చరణం 2:

కొండల్లో కోనల్లో కూయన్న ఓ కొయిలా
ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెదా
వయసంతా వలపై మనసే మైమరుపై ఊగేనే
పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే

చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడో

సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా
నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే
సిరిమల్లె పువ్వా... 

No comments:

Post a Comment