Monday, August 5, 2013

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ


చిత్రం: పండంటి కాపురం (1972)
సంగీతం: కోదండపాణి
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం:  కోదండపాణి, సుశీల

పల్లవి : 

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...
ఇది నిలిచేదేమో మూడు రోజులు... బంధాలేమో పదివేలు 

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...
ఇది నిలిచేదేమో మూడు రోజులు ...బంధాలేమో పదివేలు...

చరణం: 1 

నదిలో నావ ఈ బ్రతుకు... దైవం నడుపును తన బసకు
ఊఉ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ   
నదిలో నావ ఈ బ్రతుకు.... దైవం నడుపును తన బసకు
అనుబంధాలు ఆనందాలు... తప్పవులేరా కడవరకు
తప్పవులేరా కడవరకు....

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...
ఇది నిలిచేదేమో మూడు రోజులు... బంధాలేమో పదివేలు
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...

చరణం: 2 

రాగం ద్వేషం రంగులురా...  భోగం భాగ్యం తళుకేరా
ఊఉ..ఆ ఆ ఆ ఆ ఆ ఆ 
రాగం ద్వేషం రంగులురా... భోగం భాగ్యం తళుకేరా
కునికే దీపం తొణికే ప్రాణం... నిలిచేకాలం తెలియదురా
నిలిచేకాలం తెలియదురా....

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ.... 
ఇది నిలిచేదేమో మూడు రోజులు... బంధాలేమో పదివేలు....
ఇదిగో దేవుడు చేసిన బొమ్మ...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3012

No comments:

Post a Comment