Monday, August 5, 2013

మనసా కవ్వించకే నన్నిలా


చిత్రం: పండంటి కాపురం (1972)
సంగీతం: కోదండపాణి
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

    మనసా... కవ్వించకే నన్నిలా
    ఎదురీదలేక కుమిలేను నేనూ
    సుడిగాలిలో చిక్కినా నావను
    మనసా... కవ్వించకే నన్నిలా... 

చరణం 1:

    ఆనాడు వెన్నెల నేనై కరిగాను కౌగిలిలోనా
    ఈనాడు చీకటి లాగా మిగిలాను చీకటిలోనా
    నేనోడిపోయి గెలుపొందినాను
    నేనోడిపోయి గెలిపొందినాను
    గెలిచానని నవ్వనా.... ఏడ్వనా....  ఆ..ఆ..
    మనసా... కవ్వించకే నన్నిలా...

చరణం 2:

    మోముపై ముంగురులేమో వసివాడి మల్లియలాయే
    గుండెలో కోరికలన్నీ కన్నీటి చారికలాయే
    ఏ తీవెకైనా కావాలి తోడూ..
    ఏ తీవెకైనా కావాలి తోడు
    నా జీవితం శాపమా... పాపమా....  ఆ..ఆ..
    మనసా... కవ్వించకే నన్నిలా... 

చరణం 3:

    ఎగిరింది కడలి కెరటం ఆ నింగి స్నేహం కోసం
    ఎగిరింది కడలి కెరటం ఆ నింగి స్నేహం కోసం
    ఏనాటికైనా అవి చేరువౌన...
    కెరటానికి నింగికి స్నేహమా...

  మనసా... కవ్వించకే నన్నిలా
    ఎదురీదలేక కుమిలేను నేనూ
    సుడిగాలిలో చిక్కినా నావను
    మనసా... కవ్వించకే నన్నిలా... 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3057

No comments:

Post a Comment