Showing posts with label మైలవరపు గోపి. Show all posts
Showing posts with label మైలవరపు గోపి. Show all posts

Wednesday, December 13, 2023

చదవాలి ఎదగాలి చిన్నపిల్లలూ





చిత్రం : చిరంజీవి రాంబాబు (1978)

సంగీతం : జె.వి.రాఘవులు  

గీతరచయిత : మైలవరపు గోపి 

నేపథ్య గానం :  సుశీల 


పల్లవి : 


చదవాలి ఎదగాలి చిన్నపిల్లలూ

అది చూసి మురవాలి తల్లిదండ్రులు

చదవాలి ఎదగాలి చిన్నపిల్లలూ

అది చూసి మురవాలి తల్లిదండ్రులు

అనుభవాల ఓనమాలు దిద్దుకొంటూ

అనుభవాల ఓనమాలు దిద్దుకొంటూ

మంచీ చెడు గుణింతాలు తెలుసుకుంటూ


చదవాలి ఎదగాలి చిన్నపిల్లలూ

అది చూసి మురవాలి తల్లిదండ్రులు


చరణం 1 : 


చదువెపుడూ దీపంలా వెలుగుతుంది

మనిషి మనసులోని చీకటిని మాపుతుంది

చదువెపుడూ దీపంలా వెలుగుతుంది

మనిషి మనసులోని చీకటిని మాపుతుంది

బ్రతుకంటే ఏమిటో నేర్పుతుంది

బ్రతుకంటే ఏమిటో నేర్పుతుంది

నిన్ను పదుగురిలో పెద్దగా నిలుపుతుంది


చదవాలి ఎదగాలి చిన్నపిల్లలూ

అది చూసి మురవాలి తల్లిదండ్రులు


చరణం 2 : 


కులమతాలు నీ మనసుకు సోక కూడదు

కలనైనా ఎవరి చెరుపు కోరకూడదు

కులమతాలు నీ మనసుకు సోక కూడదు

కలనైనా ఎవరి చెరుపు కోరకూడదు

ఒకరి తప్పులెంచుకుంటు గడప కూడదు

ఒకరి తప్పులెంచుకుంటు గడప కూడదు

తప్పు జరుగ కూడదూ


చదవాలి ఎదగాలి చిన్నపిల్లలూ

అది చూసి మురవాలి తల్లిదండ్రులు

అనుభవాల ఓనమాలు దిద్దుకొంటూ

అనుభవాల ఓనమాలు దిద్దుకొంటూ

మంచీ చెడు గుణింతాలు తెలుసుకుంటూ


చదవాలి ఎదగాలి చిన్నపిల్లలూ

అది చూసి మురవాలి తల్లిదండ్రులు

అది చూసి మురవాలి తల్లిదండ్రులు

Wednesday, September 23, 2020

కలహంస నడకదానా

 




చిత్రం  :  సమాధికడుతున్నాం చందాలివ్వండి (1980)

సంగీతం  :  జె. వి. రాఘవులు

గీతరచయిత  :  మైలవరపు గోపి

నేపథ్య గానం  : బాలు




పల్లవి :


కలహంస నడకదానా 

కమలాల కనులదానా

నీ కనులు నీలి కురులు నను నిలువనీకున్నవే


కలహంస నడకదానా... ఆ.. ఆ.. ఆ..



చరణం 1 :



చెలి మేని కదలికలా అవి భరతనాట్యాలు

జవరాలి భంగిమలా అరుదైన శిల్పాలు

చెలి మేని కదలికలా అవి భరతనాట్యాలు

జవరాలి భంగిమలా అరుదైన శిల్పాలు


కలలు తలపోసి కళలు కలబోసి

ఎవరు మలచేరు ఈ రూపం


కలహంస నడకదానా 

కమలాల కనులదానా

నీ కనులు నీలి కురులు నను నిలువనీకున్నవే


కలహంస నడకదానా... ఆ.. ఆ.. ఆ..


చరణం 2 :



శ్రీదేవి కోవెలలో ఈ దేవి నా జతలో

కొలువైన వేళలలో  ఎన్నెన్ని భావనలో

శ్రీదేవి కోవెలలో ఈ దేవి నా జతలో

కొలువైన వేళలలో  ఎన్నెన్ని భావనలో



చేయి జత కలిపి గొంతు శృతి కలిపి

ఏకమవుదాము ఈనాడు


కలహంస నడకదానా 

కమలాల కనులదానా

నీ కనులు నీలి కురులు నను నిలువనీకున్నవే


కలహంస నడకదానా... ఆ.. ఆ.. ఆ..




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7505

Sunday, September 20, 2020

సమాధి కడుతున్నాం బాబు

 చిత్రం : సమాధికడుతున్నాం చందాలివ్వండి (1980)

సంగీతం : జె. వి. రాఘవులు

గీతరచయిత : మైలవరపు గోపి 

నేపథ్య గానం :  సుశీల  




పల్లవి :


సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి

పెద్దమనుషుల దోపిడీలకు పెత్తందారి 

విధానాలకు సజావుగా బహు నిజాయితీగా

సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి



చరణం 1 :


కరెన్సినోట్లు రాజ్యం చేసే గడ్డురోజులు పోయాయి

కష్టజీవి కన్నీటి బొట్లు ఓట్లుగా మారాయి

చందా అంటే చందరయ్యకు వేసే మీ ఓటు

ఓటేపునాది ఛస్తే సమాధి రేపటి ఉగాది కోసం


సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి


చరణం 2 :


అమ్మల్లారా అయ్యల్లారా... 

ఓనమహా రానివాళ్లకు ఓట్లువెయ్యద్దు...  

ఎం.ఎల్.ఏ చెయ్యద్దు 

దేవుడుకిచ్చే పండు ఫలము దెయ్యాలకు వద్దు

గ్రామదేవతలకు వద్దు 

ఓటేపునాది ఛస్తే సమాధి రేపటి ఉగాదికోసం


సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి

సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి

పెద్దమనుషుల దోపిడీలకు పెత్తందారి 

విధానాలకు సజావుగా బహు నిజాయితీగా

సమాధి కడుతున్నాం చందాలివ్వండి



సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి

సమాధి కడుతున్నాం బాబు చందాలివ్వండి


Tuesday, July 16, 2019

చిరుగాలి... చెప్పవే గొరవంకకి

చిత్రం : గ్రహణం విడిచింది (1980)
సంగీతం :  
రమేశ్ నాయుడు    

గీతరచయిత : మైలవరపు గోపి

నేపథ్య గానం :  బాలు, శైలజ



పల్లవి :



చిరుగాలి..
చిరుగాలి... చెప్పవే గొరవంకకి..
చేరువలో చిలకమ్మ.. వచ్చి కూర్చుందనీ..
చిరుగాలి... చెప్పవే గొరవంకకి..
చేరువలో చిలకమ్మ.. వచ్చి కూర్చుందనీ..


చిరుగాలి చెప్పవే చిలకమ్మకి..
పిలవకనే ఒడిలోకి  వచ్చి వాలాలనీ
చిరుగాలి చెప్పవే చిలకమ్మకి..
పిలవకనే ఒడిలోకి  వచ్చి వాలాలనీ



చరణం 1 :


ఆ చిరునవ్వులే వరి మడిలోనా వంక సన్నాలు
ఆ చిరునవ్వులే వరి మడిలోనా వంక సన్నాలు
కలకంటి చూపులో చిందే...  వలపులే శీత కాటుకలు

నీ చల్లని రెప్పల నీడలోనే రాజభోగాలు
నీ చల్లని రెప్పల నీడలోనే రాజభోగాలు
నీ కమ్మని కౌగిలి నాదైతే రోజులు నిమిషాలు



చిరుగాలి... చెప్పవే గొరవంకకి..
పిలవకనే ఒడిలోకి  వచ్చి వాలాలనీ



చరణం 2 :



నువు కదలాడితే.. నా ఎదలోన ఎన్ని కోరికలు..
నువు కదలాడితే.. నా ఎదలోన ఎన్ని కోరికలు..
నీ నిండు మనుగడే.. నాకు పసుపు కుంకుమలు..


నువు లాలించే వేళలో...  నే పాపనవుతాను..
నువు లాలించే వేళలో...  నే పాపనవుతాను..
నీ చలవుంటే ఒకనాటికి నేను.. తల్లినవుతాను..


చిరుగాలి... చెప్పవే గొరవంకకి..
చేరువలో చిలకమ్మ.. వచ్చి కూర్చుందనీ..


చిరుగాలి చెప్పవే చిలకమ్మకి..
పిలవకనే ఒడిలోకి  వచ్చి వాలాలనీ



Wednesday, June 5, 2019

జీవితం అన్న..మాటా

చిత్రం : చేసిన బాసలు (1980)
సంగీతం : సత్యం
గీతరచయిత : మైలవరపు గోపి
నేపథ్య గానం : బాలు, రామకృష్ణ , సుశీల






పల్లవి :





జీవితం అన్న మాటా... నిండు నూరేళ్ళ బాటా
మలుపులుంటాయి... గెలుపులుంటాయి
నవ్వుతూ సాగిపో... ఓ... ఓ


అహహాహహా ఆ..అహహాహహా ఆ
మలుపులుంటాయి... గెలుపులుంటాయి
నవ్వుతూ సాగిపో... ఓ... ఓ
జీవితం అన్న మాటా... నిండు నూరేళ్ళ బాటా




చరణం 1 :




ఈ తమ్ముడే అన్న ప్రాణం... మా అన్న నా పాలి దైవం
ఈ తమ్ముడే అన్న ప్రాణం... మా అన్న నా పాలి దైవం


అమ్మను తలపించి... నాన్నను మరపించి
అమ్మను తలపించి... నాన్నను మరపించి... అండగ నిలిచావులే..


జీవితం అన్న మాటా... నిండు నూరేళ్ళ బాటా






చరణం 2 :




సిరులేమీ నే కోరలేదూ... నీ చిరునవ్వులే నాకు చాలు...
సిరులేమీ నే కోరలేదూ... నీ చిరునవ్వులే నాకు చాలు... 


కొంగులు ముడివేసి... కోర్కెలు కలబోసి
కొంగులు ముడివేసి... కోర్కెలు కలబోసి...  నీతో అడుగేయనీ... 



జీవితం అన్న మాటా... నిండు నూరేళ్ళ బాటా..




చరణం 3 :






ఏ జన్మలో పుణ్యఫలమో... ఏ దేవతల చూపు ఫలమో..
ఏ జన్మలో పుణ్యఫలమో...  ఏ దేవతల చూపు ఫలమో..


చల్లని నీచేయి... నిండుగా పేనవేయీ
చల్లని నీచేయి... నిండుగా పేనవేయీ
మాకీ  వరమీయారా..ఆ ఆ ఆ




జీవితం అన్న మాటా... నిండు నూరేళ్ళ బాటా
మలుపులుంటాయి... గెలుపులుంటాయి
నవ్వుతూ... సాగిపో..ఓ... ఓ
జీవితం అన్న మాటా... నిండు నూరేళ్ళ బాటా 



Thursday, June 1, 2017

చూడచక్కనిదానా

చిత్రం : కార్తీక దీపం (1979)
సంగీతం : సత్యం
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : సుశీల,బాలు


పల్లవి :  



అహ.. అహ.. అహ...
చూడచక్కనిదానా.. అహా
అహ.. చూపు బిత్తరిదానా
నీ మిసమిసలు.. ఈ రుసరుసలు చూస్తేనే మనసౌతోంది

అహ... చూడచక్కనిదానా.. అహా
అహ.. చూపు బిత్తరిదానా
నీ మిసమిసలు.. ఈ రుసరుసలు చూస్తేనే మనసౌతోంది

అహ... చూడచక్కనివాడా...
అహ.. చూపు కత్తెరవాడా
నీ రెపరెపలు.. ఈ తహతహలు చూస్తుంటే మతి పోతోంది
అహ... చూడచక్కనివాడా... ఆ.. ఆ.. ఆ..




చరణం 1 :


నీ సొగసులకు నా చూపులను నే కావలి పెడతానే
నీ పదవులపై నా పెదవులకు అహా  పెత్తనమిస్తానే 


చిలిపివయసు... కలికిమనసు
అహ.. చిలిపివయసు... కలికిమనసు...  పంచుకుంటానే.. హా...


అహ... చూడచక్కనిదానా.. అ.. ఆ.. ఆ..



చరణం 2 :


నువ్వు  కావాలన్న అందీఅందక ఆరడి చేస్తాను
నను కాదంటున్నా కలలో కలిసి అల్లరి పెడతాను


నిమిషమైనా వదలలేని
నిమిషమైనా వదలలేని... గారడి చేస్తాను


అరెరెరె.. అహ... చూడచక్కనిదానా..అహ.. చూపు కత్తెరవాడా
నీ మిసమిసలు.. ఈ రుసరుసలు చూస్తేనే మనసౌతోంది
నీ రెపరెపలు.. ఈ తహతహలు చూస్తుంటే మతి పోతోంది
చూడచక్కనిదానా... అహ.. చూడచక్కనివాడా... ఆ.. ఆ.. ఆ 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2551

Thursday, March 30, 2017

కౌగిలి... తొలి కౌగిలి

చిత్రం : గిరిజా కళ్యాణం (1981)
సంగీతం : సత్యం
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : బాలు,  శైలజ 



పల్లవి :


కౌగిలి...  తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
కౌగిలి....  ఇది తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి


ఇది ఎన్నటికి సన్నజాజి పందిరి
ఇలా ఇలా నిలిచివుండని..హో
కౌగిలి తొలి  కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
ఇది ఎన్నటికి సన్నజాజి పందిరి
ఇలా ఇలా నిలిచివుండని


కౌగిలి తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి 


చరణం 1 :



ఎంతందం ఏమందం...  ఈ లేతమేనిలో
ఆశలెన్నో రేపుతోంది గుండెలో..హా
ఈ సొగసు నా మనసు...  నీ చేతికివన్నా
నిన్ను వలచి నన్ను మరచి నిలవనా
ఆ.. పొదలొ పువ్వు....  నీ యెదపై నేను
నింగికి మబ్బు... నాతో నువ్వు



కౌగిలి....  ఇది తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
ఇది ఎన్నటికి... సన్నజాజి పందిరి
ఇలా ఇలా...నిలిచివుండని


కౌగిలి..తొలి..కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి 



చరణం 2 :


నీ చేయి నా చేయి కలిసి నడవని
నీ అడుగున అడుగు వేసి సాగని..హా
ఎపుడమ్మ తీరేది ఈ వయస్సు  ఆకలి
నా కలలో  నిన్న మొదటి రాతిరి
సమయం రాని... ఒకటై పోని
వలపు నిండని... కలలు పండని


కౌగిలి ఇది...తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
ఇది ఎన్నటికి సన్నజాజి పందిరి
ఇలా..ఇలా..నిలిచివుండని


కౌగిలి..తొలి..కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి






Wednesday, February 1, 2017

గోగులుపూచే గుట్ట మీదా

చిత్రం : ధర్మచక్రం (1980)
సంగీతం : సత్యం
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


గోగులుపూచే గుట్ట మీదా... మందలు కాచే అందగాడా
తొందరెందుకు.. చిందులెందుకు.. సందపొద్దు వాలాలిరా
హేయ్.. లబలబదియ్య



గోగులుపూచే గుట్ట మీదా... గోపికలాంటి సిన్నదానా
సద్దు చెయ్యకా...  ముద్దులియ్యకా నిన్నిడిచిపెడతానటే...
హేయ్.. లబలబదియ్య



గోగులుపూచే గుట్ట మీదా... గోపికలాంటి సిన్నదానా  



చరణం 1 :


బొంగరాల బుగ్గ మీదా... ఊ..హూ..
నీ ఉంగరాల సిగ్గు చూస్తే.. ఊ..హూ..
ఎండమావి గుండెలోనా... ఊ..హూ
కొండవాగు వరదలైతే.. ఊ..హూ


వరదాలాంటి మరదలొస్తే... నన్ను కెరటమల్లే  కిలకేస్తే..ఏ..ఏ..
వరదాలాంటి మరదలొస్తే... నన్ను కెరటమల్లే  కిలకేస్తే..ఏ..ఏ..


చక్కిలిగింతలచిక్కని వాడా ఉక్కిరిబిక్కిరి అయిపోతావేం...
చక్కిలిగింతలచిక్కని వాడా ఉక్కిరిబిక్కిరి అయిపోతావేం...


హైలో హైలో హైలో హైలో.... సైలో సైలో సైలో సైలో...




చరణం 2 :



కొంటె చూపు ఎండలాడితే.. ఊ..హూ
నా దోర నవ్వు బేరమాడితే.. ఆహా
ఆ పూలబుట్ట వన్నెలన్నీ.. ఊ..హూ
నన్ను మాల కట్టి వేసుకోనీ.. ఊ..హూ.. 



దొంగలాగ తొంగి చూడకు... ఒరయ్యో..  దుయ్యబట్టి కొయ్యబోకు..ఓ..ఓ..
దొంగలాగ తొంగి చూడకు... ఒరయ్యో .. దుయ్యబట్టి కొయ్యబోకు..ఓ..ఓ.. 


రంగుల చీర పొంగులతోటే రంకెలు వేసి రెచ్చిపోకు...
రంగుల చీర పొంగులతోటే రంకెలు వేసి రెచ్చిపోకు... 



గోగులుపూచే గుట్ట మీదా... మందలు కాచే అందగాడా
తొందరెందుకు.. చిందులెందుకు.. సందపొద్దు వాలాలిరా


హేయ్.. లబలబదియ్య

గోగులుపూచే గుట్ట మీదా... గోపికలాంటి సిన్నదానా
 






Wednesday, May 25, 2016

చెల్లెమ్మకు పెళ్ళంట







చిత్రం: దేవాంతకుడు (1984)
సంగీతం: జె.వి. రాఘవులు
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: బాలు, శైలజ



పల్లవి :



స్వస్తిశ్రీ చాంద్రమాన రుధిరోద్గారి నామ సంవత్సరము..
మార్గశిర పౌర్ణమి బుద్ధవారం పుష్యమి నక్షత్రయుక్త శుభలగ్నమందు





చెల్లెమ్మకు పెళ్ళంట...  అన్నయ్యకు సంబరమంట
చెల్లెమ్మకు పెళ్ళంట...  అన్నయ్యకు సంబరమంట
ఏ ఇంటికి ఇల్లాలైనా...  నా కంటికి పాపేనంటా



చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంటా
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట 




చరణం 1 :



ఎదపై ఆడిన నా చిట్టి చెల్లి... వధువుగ మారే సమయంలో
ఎదపై ఆడిన నా చిట్టి చెల్లి... వధువుగ మారే సమయంలో 



నింగినంతగా పందిరి వేసి... నేల నిండుగా వేదిక వేసి
పూలరథంలో పంపిస్తా.. ఆ.. ఆ.. నలుగురిలోనే గర్విస్తా




చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంటా
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట 




చరణం 2 :


ఆ దేవుడు దిగి వస్తే వరమొక్కటి ఇమ్మంటా
ఆ దేవుడు దిగి వస్తే వరమొక్కటి ఇమ్మంటా


మరు జన్మనేదే ఉంటే ఈ అన్నే కావాలంటా
ఆ దేవుడు దిగి వస్తే వరమొక్కటి ఇమ్మంటా



చరణం 3 :



కొంగుముడితో నే వెళ్లిపోతే...  ఏమౌతుందో నీ పేద మనసు
కొంగుముడితో నే వెళ్లిపోతే...  ఏమౌతుందో నీ పేద మనసు



ఎక్కడ ఉన్నా.. నేనేమైనా...  కోరేదేమిటి నీ బాగు కన్నా
పెద్ద మనసుతో దీవిస్తున్నా.. .. ఆ.. ఆ.. వయసున నీకు చిన్నైనా



చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట
ఏ ఇంటికి ఇల్లాలైనా నా కంటికి పాపేనంటా
చెల్లెమ్మకు పెళ్ళంట.. అన్నయ్యకు సంబరమంట  







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8063

Thursday, May 5, 2016

చట్టానికి కళ్ళు లేవు






చిత్రం :  చట్టానికి కళ్ళు లేవు (1976)
సంగీతం :  కృష్ణ-చక్ర
గీతరచయిత :  మైలవరపు గోపి
నేపధ్య గానం : బాలు



పల్లవి :


చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు
చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు


ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకడం
దొంగ దొరై తిరగడం




చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు



చరణం 1 :


ఋజువయ్యిందే ఇక్కడ సత్యమట
వాదమాడి గెలిచిందే వేదమట
ఋజువయ్యిందే ఇక్కడ సత్యమట
వాదమాడి గెలిచిందే వేదమట



పిల్లి ఎలుకల నడుమ ఎందుకు సాక్ష్యం
పిల్లి ఎలుకల నడుమ ఎందుకు సాక్ష్యం
ఎలుకే పిల్లిని తిందని పెద్దల వాదం..పెద్దల వాదం


చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు
చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు


ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకడం
దొంగ దొరై తిరగడం




చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు




చరణం 2 :


గుడిసెలోన దొరికిందా సానిదట
మేడలోని ఆట నాగరీకమట
గుడిసెలోన దొరికిందా సానిదట
మేడలోని ఆట నాగరీకమట
కూడులేక ఒప్పుకుంటే నేరమట
కూడులేక ఒప్పుకుంటే నేరమట



తప్పతాగి విప్పుకుంటే నాట్యమట..అది నాట్యమట


చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు
చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు


ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకడం
దొంగ దొరై తిరగడం




చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు





చరణం 3 :



ఒకరు నమ్ముకున్న దారి రాదారి
ఒకరు ఎంచుకున్న దారి పెడదారి
ఒకరు నమ్ముకున్న దారి రాదారి
ఒకరు ఎంచుకున్న దారి పెడదారి



మార్గాలే వేరుగాని గమ్యం ఒకటే
మార్గాలే వేరుగాని గమ్యం ఒకటే
ఎవరు గెలిచినా గాని గెలుపు తల్లిదే..గెలుపు తల్లిదే 




చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు
చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు


ఇక్కడున్నదొక్కటే కొట్టి బ్రతకడం
దొంగ దొరై తిరగడం



చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు
చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు
న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు





కలిసిపో నా కళ్ళలో




చిత్రం :  చట్టానికి కళ్ళు లేవు (1976)
సంగీతం :  కృష్ణ-చక్ర
గీతరచయిత :  మైలవరపు గోపి
నేపధ్య గానం : బాలు, సుశీల  



పల్లవి :


కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో
కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో


కోరికలెదురై తొందరపెడితే బదులేమివ్వాలి
అంతకు ముందే నువ్వూ నేనూ ఒకటని చెప్పాలి 


కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో




చరణం 1 :



ఒంటిగ ఉంటే తుంటరి గాలి అల్లరి పెడుతోంది
పైటను లాగి పాపిడి రేపి ఆరడి పెడుతోంది
ఒంటిగ ఉంటే తుంటరి గాలి అల్లరి పెడుతోంది
పైటను లాగి పాపిడి రేపి ఆరడి పెడుతోంది



గాలికి కూడా చోటే ఈయని కౌగిలి ఒకటుంది
వలచిన వారికి వాకిలి తెరిచి స్వాగతమిస్తుంది.. స్వాగతమిస్తుంది



కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో




చరణం 2 :



అరఘడియైనా విడవకు నన్ను దణ్ణం పెడతాను
పెదవులు కలిపి ఏం చేయమన్న ముద్దుగ చేస్తాను
అరఘడియైనా విడవకు నన్ను దణ్ణం పెడతాను
పెదవులు కలిపి ఏం చేయమన్న ముద్దుగ చేస్తాను



ఆశకు కూడా హద్దొకటుంది.. పొద్దూ ఒకటుంది
ఏ ముద్దైనా గుట్టుంటేనే ముద్దుగ ఉంటుంది... ముద్దుగ ఉంటుంది



కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో
కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో


కోరికలెదురై తొందరపెడితే బదులేమివ్వాలి
అంతకు ముందే నువ్వూ నేనూ ఒకటని చెప్పాలి


కలిసిపో నా కళ్ళలో.. కరిగిపో కౌగిళ్ళలో







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9608

Sunday, April 17, 2016

దేవతలందరు ఒకటై వచ్చి

చిత్రం :  ధర్మాత్ముడు (1983)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  మైలవరపు గోపి
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి : 


దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలియ్యాలి
దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలియ్యాలి
నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేళ్ళు నిలవాలి


నిన్నటి పాపవు నువ్వు.. రేపటి తాతను నేను
ఇల్లాలీ శీమంతం.. ఒడి నిండే సౌభాగ్యం

దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలియ్యాలి
దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలియ్యాలి 


నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేళ్ళు నిలవాలి
నిన్నటి పాపవు నువ్వు.. రేపటి తాతను నేను
ఇల్లాలీ శీమంతం.. ఒడి నిండే సౌభాగ్యం





చరణం 1 :



గాజులేసి గంధం పూసి.. దిష్టి బొట్టు బుగ్గన పెట్టి
హారతీయరారే... పాట పాడ రారే


మీ అందరు ఆశీస్సులే రామరక్ష జీవితాన
ఎన్నటికీ పాపవమ్మా కన్నవారి కళ్ళలోనా
మా ప్రాణం.. మా ధ్యానం.. మా సర్వం నీవేనమ్మ




ఇల్లాలీ శీమంతం.. ఒడి నిండే సౌభాగ్యం
ఇల్లాలీ శీమంతం.. ఒడి నిండే సౌభాగ్యం




దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలియ్యాలి
దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలియ్యాలి
నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేళ్ళు నిలవాలి


నిన్నటి పాపవు నువ్వు.. రేపటి తాతను నేను
ఇల్లాలీ శీమంతం.. ఒడి నిండే సౌభాగ్యం




చరణం 2 :



చిట్టి తల్లి కడుపున మోసే... చిన్ని నాన్న ఎంతటి వాడో
రామచంద్రుడో... బాలకృష్ణుడో


తాత పేరు నిల్కంటికి వెలుగిచ్చే దీపమై
వెలగాలీ ఏనాడు ని కడుపున పెట్టెవాడు



ఇల్లాలీ శీమంతం.. ఒడి నిండే సౌభాగ్యం
ఇల్లాలీ శీమంతం.. ఒడి నిండే సౌభాగ్యం




దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలియ్యాలి
దేవతలందరు ఒకటై వచ్చి దీవెనలియ్యాలి
నీ పసుపు కుంకుమ సౌభాగ్యం నూరేళ్ళు నిలవాలి


నిన్నటి పాపవు నువ్వు.. రేపటి తాతను నేను
ఇల్లాలీ శీమంతం.. ఒడి నిండే సౌభాగ్యం









Saturday, April 16, 2016

దమ్ముంటే కాచుకోండి

చిత్రం: ధర్మాత్ముడు (1983)
సంగీతం: సత్యం
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: బాలు, సుశీల, జానకి 



పల్లవి : 



దమ్ముంటే కాచుకోండి... దిల్లుంటే లేచిరండి
పోరుకైనా.. పొందుకైనా.. ఎందుకైనా.. దా


సోగాడా... నీ వలపులు గెలుపులు ఏ వేళా.. అవి నావే నావే
మొనగాడా... నా కులుకులు తళుకులు నీకేరా.. ఇవి నీకే.. నీకే


దమ్ముంటే కాచుకోండి... దిల్లుంటే లేచిరండి
పోరుకైనా.. పొందుకైనా.. ఎందుకైనా.. దా




చరణం 1 :


ఎందరెందరినో చూసినాను.. నీ పొగరు వాడి లేదే.. హా.. హా
ఆటపాటలకు రాణి నేను.. నీ ముంది ఓడిపోనీ


పపపప..రా
రూపంలో గులాబి ఒకరు... ఊరించే షరాబీ ఒకరు.. హా
రారారారా.. రారారా...రారారారా.. రారారా...


సోగాడా... నీ వలపులు గెలుపులు ఏ వేళా.. అవి నావే నావే
మొనగాడా... నా కులుకులు తళుకులు నీకేరా.. ఇవి నీకే.. నీకే


దమ్ముంటే కాచుకోండి... దిల్లుంటే లేచిరండి
పోరుకైనా.. పొందుకైనా.. ఎందుకైనా.. దా 



చరణం 2 :



కునుకు రాదు నీ రూపు చూసి... ఆ తప్పు నాది కాదు.. ఆహా
నిలువ లేను నీ తోడు లేక.. నేనెటుల చెప్పుకోను... 


షబదరబరా....
నీలోని వయారం నాది...  నాలోని సరాగం నీది రా
రారారారా.. రారారా...రారారారా.. రారారా...



మొనగాడా... నా కులుకులు తళుకులు నీకేరా.. ఇవి నీకే నీకే
సోగాడా... నీ వలపులు గెలుపులు ఏ వేళా.. అవి నావే నావే



దమ్ముంటే కాచుకోండి... దిల్లుంటే లేచిరండి
పోరుకైనా.. పొందుకైనా.. ఎందుకైనా.. దా .. దా  






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=4188

Tuesday, April 5, 2016

గోపాలరావు గారి అమ్మాయి





చిత్రం : గోపాలరావు గారి అమ్మాయి (1980)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : బాలు 


పల్లవి :



గోపాలరావు గారి అమ్మాయి.. లోకం తెలియని పాపాయి
గోపాలరావు గారి అమ్మాయి.. లోకం తెలియని పాపాయి


దేవులపల్లి కవితల్లే.. బాపు గీసిన బొమ్మల్లే
దేవులపల్లి కవితల్లే.. బాపు గీసిన బొమ్మల్లే


ఎవరైనా మీకెదురైతే... ఆమే... ఆమే

గోపాలరావు గారి అమ్మాయి.. లోకం తెలియని పాపాయి




చరణం 1 :



శంఖాకారం ఆమె కంఠం... శ్రీకారంలా చిన్ని నోరు
శంఖాకారం ఆమె కంఠం... శ్రీకారంలా చిన్ని నోరు


ముద్దొచ్చే ఆ లేత పెదవులు... కవ్వించే ఆ మేని బరువులు

ఎవరైనా ఎప్పుడైనా.. ఎక్కడైనా మీకెదురైతే... ఆమే... ఆమే...


గోపాలరావు గారి అమ్మాయి.. లోకం తెలియని పాపాయి
దేవులపల్లి కవితల్లే.. బాపు గీసిన బొమ్మల్లే
దేవులపల్లి కవితల్లే.. బాపు గీసిన బొమ్మల్లే
ఎవరైనా మీకెదురైతే... ఆమే... ఆమే
గోపాలరావు గారి అమ్మాయి.. లోకం తెలియని పాపాయి




చరణం 2 : 



మనసు చూస్తే మల్లెపువ్వు... నవ్విందంటే పాల నవ్వు
మనసు చూస్తే మల్లెపువ్వు... నవ్విందంటే పాల నవ్వు


చూసిన కంటికి మరపే రాదు.. చూడని కన్ను కన్నే కాదు
ఎవరైనా ఎప్పుడైనా.. ఎక్కడైనా మీకెదురైతే... ఆమే... ఆమే...



గోపాలరావు గారి అమ్మాయి.. లోకం తెలియని పాపాయి
దేవులపల్లి కవితల్లే.. బాపు గీసిన బొమ్మల్లే
ఎవరైనా మీకెదురైతే... ఆమే... 






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5061

Monday, April 4, 2016

ఒక వేణు గీతం



చిత్రం :  అమ్మాయి మనసు (1987)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  మైలవరపు గోపి
నేపథ్య గానం :  బాలు


పల్లవి :

హా.. ఆ.. ఆ.. హా
ఆ.. ఆ.. ఆ.. హో..ఓ.. ఓ..
లాలలాలలా... ఆ.. హా 


ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో
ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో


చిరుగాలి వీచినా... చిగురాకు రాలినా
వలపు సంగీతమై కదలాడు నాలో... ఓ.. ఓ..

ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో




చరణం 1 :



అలలై బంగారు కలలై...  మిగిలే అందాలు కొన్ని
వనవాటిలో సెలయేటిలాగ నను తొందరించసాగే


ఎదలో ఏ మూలలోనో...  కదిలే భావాలు కొన్ని
నా గుండె నుంచి... లోగొంతు నుంచి... నా పెదవి పైకి చేరే
లాలించే పాటలాగా.. హో



ఒక వేణు గీతం....  పలికింది పాటై
ఎద పల్లవించగా....  ఈవేళ నాలో




చరణం 2 :



హృదయం కోరేది స్నేహం.. స్నేహం నూరేళ్ళ దీపం
మనసున్న మనిషి తోడైన వేళ... నీదే అందాల లోకం


ప్రణయం వసంతమైతే... బ్రతుకే పూదోట కాదా
మనసులో మాట చూపులో తెలిసే.. ఎందుకో ఇంక మౌనం
ఆ మౌనం ప్రేమ భాష్యం... ఊ...



ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో


చిరుగాలి వీచినా... చిగురాకు రాలినా
వలపు సంగీతమై కదలాడు నాలో... ఓ.. ఓ..

ఒక వేణు గీతం పలికింది పాటై
ఎద పల్లవించగా ఈవేళ నాలో







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5068

Saturday, April 2, 2016

ఓ చెలి... నీకోసమే నా గానము





చిత్రం : దేవతలారా.. దీవించండి (1977)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : బాలు, సుశీల  



పల్లవి :


ఓ చెలి... నీకోసమే నా గానము...
నవ వసంత సుందరి.. ప్రణయరాగ మంజరి



ఓ సఖా... నీకోసమే నా ప్రాణము
మలయపవన రాగమా... వలపు గగన మేఘమా





చరణం 1 :



మోహమే రాగమై.. కోరికే తాళమై
మోహమే రాగమై.. కోరికే తాళమై


నాలోని భావాలు నీ రూపమై...
నీలోని నాదాలు నా గీతమై
కలిసేము నిలిచేము నవకావ్యమై
ఇలలోన వెలిగేము సంగీతమై... సంగీతమై


ఓ చెలి... నీకోసమే నా ప్రాణము...
నవ వసంత సుందరి.. మలయపవన రాగమా 




చరణం 2 :


ఊహలే ఊయలై...  ఆశలే అందమై
ఊహలే ఊయలై...  ఆశలే అందమై


అధరాలు నయనాలు జతకూడగా
సరదాలు సరసాలు చవి చూడగా


విను వీధి మన ప్రేమ సెలయేరుగా...
విహరించ దిశలన్నీ దీవించగా.. దీవించగా



ఓ చెలి... ఓ సఖా
నీకోసమే... నీకోసమే
నా గానము... నా ప్రాణము
నవ వసంత సుందరి.. మలయపవన రాగమా







Thursday, March 17, 2016

వద్దురా చెప్పకుంటే సిగ్గురా




చిత్రం : ఖైదీ కాళిదాసు (1977)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : జానకి



పల్లవి :  


వద్దురా చెప్పకుంటే సిగ్గురా... గుట్టుగా దాచుకుంటే ముప్పురా
వద్దురా చెప్పకుంటే సిగ్గురా... గుట్టుగా దాచుకుంటే ముప్పురా
పేరైనా చెప్పలేదు సచ్చినోడు...
సంతలోని ఆణ్ణి  చూసి.. నా తెలివి సంతకెళ్లే


వద్దురా చెప్పకుంటే సిగ్గురా... అబ్బా... గుట్టుగా దాచుకుంటే ముప్పురా



చరణం 1 :


సరసకు వచ్చాడు... హా... చనువుగ నవ్వాడు
మాటల గారడితో... నను మాయ చేశాడు
సరసకు వచ్చాడు... హా... చనువుగ నవ్వాడు
మాటల గారడితో...  నను మాయ చేశాడు


తప్పిపోతావన్నాడు... జట్టుకట్టకున్నాడు
జారిపోతాదన్నాడు... కొంగుపట్టుకున్నాడు
చుక్కలెన్నో చూపాలంటూ కళ్ళుమూయమన్నాడు
చుక్కలెన్నో చూపాలంటూ కళ్ళుమూయమన్నాడు
ఒళ్ళు తెలిసే లోపుగానే ఒళ్ళు నాకే ఆరిపోయే


వద్దురా చెప్పకుంటే సిగ్గురా... అబ్బా... గుట్టుగా దాచుకుంటే ముప్పురా 



చరణం 2 :


అడుగులు పడవాయే... హా.. నడుములు బరువాయే..హా
నాకు నా ఒళ్లే మాటవినదాయే
అడుగులు పడవాయే... హా.. నడుములు బరువాయే..హా
నాకు నా ఒళ్లే మాటవినదాయే


పదారేళ్లు నా పరువం పొట్టనెట్టుకున్నాడు
పదారేళ్లు నా పరువం పొట్టనెట్టుకున్నాడు
ఎందుకో వాడంటే కోపమే రాకుంది
ఎందుకో వాడంటే కోపమే రాకుంది
తప్పు చేసిన పోకిరీనే తండ్రిగా చేయాలనుంది




వద్దురా చెప్పకుంటే సిగ్గురా... గుట్టుగా దాచుకుంటే ముప్పురా
పేరైనా చెప్పలేదు సచ్చినోడు...
సంతలోని ఆణ్ణి  చూసి.. నా తెలివి సంతకెళ్లే
వద్దురా చెప్పకుంటే సిగ్గురా... అబ్బా... గుట్టుగా దాచుకుంటే ముప్పురా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2066

Monday, July 20, 2015

ఒంటరిగా ఉన్నాను

చిత్రం :  దొరబాబు (1974)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : రామకృష్ణ, సుశీల


పల్లవి :


ఒంటరిగా ఉన్నాను.. ఇస్సిరిస్సు రంటున్నాను
ఒంటరిగా ఉన్నాను.. ఇస్సిరిస్సు రంటున్నాను


ఇంతకన్న ఏం చెప్పుకోనురా  బావయ్యో.. యిడమరిచి చెప్పుకుంటే సిగ్గయ్యో
నే  యిడమరిచి చెప్పుకుంటే సిగ్గయ్యో


పక్కన నేనున్నానూ.. ఆవురావురంటున్నానూ
పక్కన నేనున్నానూ.. ఆవురావురంటున్నానూ


దారిలేక ఆగానమ్మో చిట్టమ్మో.. కంటికేమో కునుకు రాదు ఒట్టమ్మో
నా కంటికేమో కునుకు రాదు ఒట్టమ్మో


చరణం 1 :


నా మనసుకు బుద్దిలేదు పదారెళ్ళుగా.. 

బుద్దొచ్చి మరుగుతోంది నాలుగేళ్ళుగా

నా మనసుకు బుద్దిలేదు పదారెళ్ళుగా.. 

బుద్దొచ్చి మరుగుతోంది నాలుగేళ్ళుగా


నామోజుకు రంజులేదు నువ్వు చేరకా .. 

నామోజుకు రంజులేదు నువ్వు చేరకా

రంజులోన లబ్జులేదు కోర్కెతీరకా 


  ఒంటరిగా ఉన్నాను.. ఇస్సిరిస్సు రంటున్నాను
ఒంటరిగా ఉన్నాను.. ఇస్సిరిస్సు రంటున్నాను


దారిలేక ఆగానమ్మో చిట్టమ్మో..కంటికేమో కునుకు రాదు ఒట్టమ్మో
నా కంటికేమో కునుకు రాదు ఒట్టమ్మో


చరణం 2 :


పొద్దు పొడుపు ఎందుకనో చురుక్కుమంటది..  

పొద్దు గుంకితే నాలో కలుక్కుమంటదీ
పొద్దు పొడుపు ఎందుకనో చురుక్కుమంటది..  

పొద్దు గుంకితే నాలో కలుక్కుమంటదీ 


పొద్దుకైన ఒకరైతే చులకనే మరీ
పొద్దుకైన ఒకరైతే చులకనే మరీ.. ఇద్దరమూ వొకటైతే వోడిపోతదీ    


పక్కన నేనున్నానూ.. ఆవురావురంటున్నానూ
పక్కన నేనున్నానూ.. ఆవురావురంటున్నానూ


దారిలేక ఆగానమ్మో చిట్టమ్మో.. కంటికేమో కునుకు రాదు ఒట్టమ్మో
నా కంటికేమో కునుకు రాదు ఒట్టమ్మో


ఒంటరిగా ఉన్నాను.. ఇస్సిరిస్సు రంటున్నాను
ఒంటరిగా ఉన్నాను.. ఇస్సిరిస్సు రంటున్నాను
ఇంతకన్న ఏం చెప్పుకోనురా  బావయ్యో.. యిడమరిచి చెప్పుకుంటే సిగ్గయ్యో
నే  యిడమరిచి చెప్పుకుంటే సిగ్గయ్యో




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1790

అమ్మమ్మో.. ఈ గుంటడు ఎంత కిలాడి

చిత్రం :  దొరబాబు (1974)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : రామకృష్ణ, సుశీల


పల్లవి :


అమ్మమ్మో..
అమ్మమ్మో..  ఈ గుంటడు ఎంత కిలాడి
గుచ్చి గుచ్చి చంపుతాడు కళ్ళ తోటీ  . .  దొంగ కళ్ళ తోటీ 


అన్నన్నా...
అన్నన్నా.. ఈ కుర్రది టక్కులాడి
బులిపించి చంపుతాది మాటలాడీ.. మాయ మాటలాడీ 



చరణం 1 :


నీ చేెతిలో ఏదో మంత్రమున్నదీ..  తాకగానే నా గుండె కొట్టుకుంటదీ
నీ చేెతిలో ఏదో మంత్రమున్నదీ.. తాకగానే నా గుండె కొట్టుకుంటదీ
తాకితేనే నీ గుండె కొట్టుకుంటదీ.. తాకితేనే నీ గుండె కొట్టుకుంటదీ
తాకకుంటే నా గుండె ఆగిపోతదీ


అమ్మమ్మో... అమ్మమ్మో...  ఈ గుంటడు ఎంత కిలాడి
గుచ్చి గుచ్చి చంపుతాడు కళ్ళతోటీ  . .  దొంగ కళ్ళ తోటీ 


 

చరణం 2 :



నీ కంట్లో నా నీడ వెచ్చగుంటదీ.. నాకేమో ఆ వేడి దక్కనంటదీ
నీ కంట్లో నా నీడ వెచ్చగుంటదీ.. నాకేమో ఆ వేడి దక్కనంటదీ


నీడైతే నా కంట్లో కుదురుగుంటదీ.. నీడైతే నా కంట్లో కుదురుగుంటదీ
నువ్వైతే నా మనసు చెదిరిపోతదీ



అన్నన్నా... అన్నన్నా... ఈ కుర్రది టక్కులాడీ
బులిపించి చంపుతాది మాటలాడీ మాయమాటలాడీ 


చరణం 3 :


నీ సొగసే నా చూపుకి తిండి పెడతదీ... పిసినిగొట్టు నీ మనసే కసిరికొడతదీ
నీ సొగసే నా చూపుకి తిండి పెడతదీ... పిసినిగొట్టు నీ మనసే కసిరికొడతదీ


చూపుతో నీ వయసుకు కరువు తీరదు... చూపుతో నీ వయసుకు కరువు తీరదూ
తీరిస్తే నా సిగ్గుకు పరువు మిగలదూ   


అన్నన్నా...  అన్నన్నా... ఈ కుర్రది టక్కులాడీ
బులిపించి చంపుతాది మాటలాడీ.. మాయ మాటలాడీ 


అమ్మమ్మో... అమ్మమ్మో..  ఈ గుంటడు ఎంత కిలాడి
గుచ్చి గుచ్చి చంపుతాడు కళ్ళతోటీ  . .  దొంగ కళ్ళ తోటీ




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1789

Saturday, December 27, 2014

ఆమెతోటి మాటు౦ది

చిత్రం  :  అమెరికా అమ్మాయి (1976)
సంగీతం  :  జి.కె. వెంకటేశ్
గీతరచయిత  :  మైలవరపు గోపి
నేపధ్య గానం  :  బాలు  



పల్లవి : 



హే.. హే.. హే.. రూ.. రూ.. రూ.. రూ
ఆమె తోటి మాటు౦ది.. పెదవి దాటి రాకుంది
ఆమె తోటి మాటు౦ది.. పెదవి దాటి రాకుంది
ఏమున్నదో... ఆ చూపులో?




చరణం 1 :


చిరుగాలి తరగల్లె నడకలు నేర్పిందీ
సెలయేరు నురగల్లె జిలుగులు చిలికిందీ
చిరుగాలి తరగల్లె నడకలు నేర్పిందీ
సెలయేరు నురగల్లె జిలుగులు చిలికిందీ


నవ్వు నన్ను పిలిచిందీ.. కళ్ళతోటి కాదందీ
నవ్వు నన్ను పిలిచిందీ.. కళ్ళతోటి కాదందీ 


దట్స్ లవ్.. లవ్.. లవ్.. లవ్..లవ్
హే.. హే.. హే.. రూ.. రూ.. రూ.. రూ

ఆమె తోటి మాటు౦ది.. పెదవి దాటి రాకుంది
ఏమున్నదో... ఆ చూపులో?



చరణం 2 :


తనకైన లోలోన ఆశగ వుంటు౦దీ
పైపైకి నాపైన అలకలు పోతుంది
తనకైన లోలోన ఆశగ వుంటు౦దీ
పైపైకి నాపైన అలకలు పోతుంది


మనసు తెలుపనంటుందీ.. మమత దాచుకుంటుందీ
మనసు తెలుపనంటుందీ.. మమత దాచుకుంటుందీ



దట్స్ లవ్.. లవ్.. లవ్.. లవ్..లవ్
హే.. హే.. హే.. రూ.. రూ.. రూ.. రూ


ఆమె తోటి మాటు౦ది.. పెదవి దాటి రాకుంది
ఏమున్నదో... ఆ చూపులో? 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5511