Sunday, August 4, 2013

మల్లియలారా మాలికలారా

చిత్రం: నిర్దోషి (1967)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

మల్లియలారా మాలికలారా... మౌనముగా ఉన్నారా
మా కథయే విన్నారా ....

మల్లియలారా మాలికలారా... మౌనముగా ఉన్నారా
మా కథయే విన్నారా...

చరణం 1:

జాబిలిలోనే జ్వాలలు రేగే... వెన్నెలలోనే చీకటి మూగే
జాబిలిలోనే జ్వాలలు రేగే...  వెన్నెలలోనే చీకటి మూగే

పలుకగ లేక పదములు రాక...
పలుకగ లేక పదములు రాక... బ్రతుకే తానే బరువై సాగే

మల్లియలారా మాలికలారా... మౌనముగా ఉన్నారా
మా కథయే విన్నారా...

చరణం 2:

చెదరిన వీణ రవళించేనా.... జీవన రాగం చివురించేనా
చెదరిన వీణ రవళించేనా.... జీవన రాగం చివురించేనా

కలతలు పోయి వలపులు పొంగి...
కలతలే పోయి వలపులే పొంగి... మనసే లోలో పులకించేనా

మల్లియలారా మాలికలారా... మౌనముగా ఉన్నారా
మా కథయే విన్నారా.....


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=153

No comments:

Post a Comment