Wednesday, February 5, 2014

పదములె చాలు రామా

చిత్రం : బంగారు పంజరం (1969)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : ఎ. పి. కోమల

పల్లవి :

పదములె చాలు రామా..
నీ పద ధూళులే పదివేలు
నీ పదములె చాలు రామా..

చరణం 1:

నీ పదమంటిన పాదుకులు
మమ్మాదుకొనీ ఈ జగమేలు..
నీ పదములె చాలు రామా...

నీ దయ గౌతమి గంగా.. రామయ
నీ దాసులు మునుగంగా.. రామా....ఆ..
నీ దయ గౌతమి గంగా.. రామయ.. నీ దాసులు మునుగంగా
నా బ్రతుకొక నావ .. దానిని నడిపే తండ్రివి నీవా

పదములె చాలు రామా .. నీ పద ధూళులే పదివేలు
నీ పదములె చాలు రామా

చరణం 2:

కోవెల లోనికి రాలేను
నువు కోరిన కానుక తేలేను
నినుగానక నిమిషము మనలేను
నువు కనబడితే నిను కనలేను

పదములె చాలు రామా .. నీ పద ధూళులే పదివేలు
నీ పదములె చాలు రామా

No comments:

Post a Comment