Friday, February 14, 2014

గున్నమామిడి కొమ్మమీద

చిత్రం : బాలమిత్రుల కథ (1973)

సంగీతం : సత్యం

గీతరచయిత : సినారె

నేపథ్య గానం : జానకి 


పల్లవి :


గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండుండేవి 

ఒక గూటిలోనా చిలకుండేది ఒక గూటిలోన కోయిలుండేది


గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండుండేవి 


చరణం 1 :


తీగలాగ అల్లిన చెలిమి తెగుతుందని దిగులుపడి

కొమ్మవిడిన ఆ జంట కొత్తగూడు చేరింది

తీగలాగ అల్లిన చెలిమి తెగుతుందని దిగులుపడి

కొమ్మవిడిన ఆ జంట కొత్తగూడు చేరింది


ఒక్కనాడు రామచిలక ఉక్కుడేగ నీడకు జడిసి

కోయిలతో చెప్పలేక గూడు విడిచిపోయింది

గూడు చెదిరిపోయింది... 


గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండుండేవి


చరణం 2 : 


చిన్ని చిలక ఏదని కన్నతల్లి అడిగితే

కోయిలేమి బదులిస్తుంది... కుమిలి కుమిలి ఏడుస్తుంది

చిన్ని చిలక ఏదని కన్నతల్లి అడిగితే

కోయిలేమి బదులిస్తుంది... కుమిలి కుమిలి ఏడుస్తుంది


కోనకోనలో తిరిగి కొమ్మ కొమ్మను అడిగి

కొదమచిలక కనురాకుంటే కోయిల గతి ఏమవుతుంది?

గుండె పగిలి చస్తుంది...

No comments:

Post a Comment