Tuesday, February 25, 2014

కుశలమా.. నీవు కుశలమేనా

చిత్రం :  బలిపీఠం (1975)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :  బాలు, సుశీల

పల్లవి:

కుశలమా.. నీకు కుశలమేనా? 
మనసు నిలుపుకోలేక మరీ మరీ అడిగాను అంతే..అంతే .. అంతే..
కుశలమా.. నీకు కుశలమేనా? -
ఇన్నినాళ్ళు వదలలేక ఏదో ఏదో వ్రాశాను.. అంతే ..అంతే .. అంతే..


చరణం 1:

చిన్న తల్లి ఏమంది? ... నాన్న ముద్దు కావాలంది
పాలుగారు చెక్కిలి పైన... పాపాయికి ఒకటి
తేనెలూరు పెదవులపైన.. దేవిగారికొకటి
ఒకటేనా.. ఒకటేనా.. ఎన్నైనా.. ఎన్నెన్నో..
మనసు నిలుపుకోలేక.. మరీ మరీ అడిగాను.. అంతే ..అంతే.. అంతే..
కుశలమా... హాయ్


చరణం 2:

పెరటిలోని పూలపానుపు... త్వర త్వరగా రమ్మంది.
పొగడ నీడ పొదరిల్లో.. దిగులు దిగులుగా ఉంది.
ఎన్ని కబురులంపేనో.. ఎన్ని కమ్మలంపేనో
పూలగాలి రెక్కలపైనా.. నీలిమబ్బు పాయలపైనా
అందేనా.. ఆ..  ఒకటైనా..ఆ.. ఆ ఆ
అందెనులే... తొందర తెలిసెనులే
ఇన్నినాళ్ళు వదలలేక - ఏదో ఏదో రాశాను
అంతే .. అంతే.. అంతే..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2397

No comments:

Post a Comment