Sunday, March 16, 2014

నిన్నే నిన్నే చెలి నిలు నిలుమా

చిత్రం :  బభ్రువాహన (1964)
సంగీతం :  పామర్తి
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల

పల్లవి:

నిన్నే.. నిన్నే.. చెలి నిలు నిలుమా..
నినువిడి నిలువగ లేను సుమా...
నిన్నే.. నిన్నే.. చెలి నిలు నిలుమా..

నను విడుమా... ఇక నను విడుమా
నను విడుమా... ఇక నను విడుమా
నమస్తే జటాధారి... నా దారిని
విడు విడుమా.. చెలి నిలు నిలుమా...

చరణం 1:

మగువలు కోలువగ దరిజేరగా...మతిమాయుట యతులకు న్యాయమా..
మగువలు కోలువగ దరిజేరగా...మతిమాయుట యతులకు న్యాయమా..
నీ కనుసన్నలా నను కరుణించినా...ఈ సన్యాసి మారేను సంసారిగా
విడు విడుమా ..చెలి నిలు నిలుమా...

చరణం 2:

ఆపకుమా నే పాపినయ్య.. ఈ రూపము నిలువగ రానిదయా...
ఆపకుమా నే పాపినయ్య.. ఈ రూపము నిలువగ రానిదయా...
నీ రూపానికే నే ఈ రూపున... ఇట చేరి జపించి తపించేనులే....
విడు విడుమా .. చెలి నిలు నిలుమా...

చరణం 3:

విజయునికే తనువంకితం...నీ చెలువుని మోసం చెయుదువా?
విజయునికే తనువంకితం...నీ చెలువుని మోసం చెయుదువా?
నేనే విజయుండను ...నేనే చెలి కాదను...ఈ గోశాయి వేసాలు నీకోసమే ...
హా...ఆ...
నిలు నిలుమా..నను విడు విడుమా
నిలు నిలుమా..నను విడు విడుమా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18248

1 comment:

  1. Please give lyrics of all the songs of the telugu movie babhruvaahana

    ReplyDelete