Sunday, March 16, 2014

అందమైన తీగకు

చిత్రం :  భార్య బిడ్డలు (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:


అందమైన తీగకు.. పందిరుంటె చాలును
పైకి పైకి పాకుతుంది చినదానా...
పరవశించి సాగుతుంది చినదానా ...
అందమైన తీగకు పందిరుంటె చాలును
పైకి పైకి పాకుతుంది చినదానా...
పరవశించి సాగుతుంది చినదానా ...


చరణం 1:


గువ్వకెగిరే కోరికుంటే రెక్కలొస్తాయి

తప్పటడుగులె ముందు ముందు నడకలౌతాయి

ఆశ ఉంటే మోడుకూడా చిగురు వేస్తుంది

అందమున కానందమపుడే తోడువస్తుంది
అందమైన తీగకు పందిరుంటె చాలును

పైకి పైకి పాకుతుంది చినదానా...పరవశించి సాగుతుంది చినదానా ...


చరణం 2:


పాదులోని తీగవంటిది పడుచు చిన్నది
పరువమొస్తే చిగురు వేసి వగలుబోతుంది
మొగ్గ తొడిగీ మురిసిపోతూ సిగ్గు పడుతుందీ
తగ్గ జతకై కళ్లతోటే వెతుకుతుంటుంది....


అందమైన తీగకు పందిరుంటె చాలును
పైకి పైకి పాకుతుంది చినదానా...
పరవశించి సాగుతుంది చినదానా ...


చరణం 3:


కళ్లు కళ్లు కలిసినపుడు కలలు వస్తాయి
కన్నెపిల్ల కలలకెపుడో కాళ్లు వస్తాయి
అడుగులోన అడుగు వేస్తూ అందమొస్తుంది
నడవలేని నడకలే ఒక నాట్యమౌతుంది...


అందమైన తీగకు పందిరుంటె చాలును
పైకి పైకి పాకుతుంది చినదానా...
పరవశించి సాగుతుంది చినదానా ...


No comments:

Post a Comment