Wednesday, March 5, 2014

ఎన్నీయల్లో ఎన్నీయల్లో సందామామ

చిత్రం :  భక్త కన్నప్ప (1976)
సంగీతం : సత్యం
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  రామకృష్ణ, సుశీల


పల్లవి:

హోయ్.... హోయ్..
ఎన్నీయల్లో..ఎన్నీయల్లో..సందామామ..హుయ్
సిన్నాదాని మనువు సేయి సందామా..
ఎన్నీయల్లో..ఎన్నీయల్లో..సందామామ..హుయ్
సిన్నాదాని మనువు సేయి సందామామ....

అరె చిన్నోడా...
ఆకు చాటున పిందె వుంది.. చెట్టు చాటున సిన్నాదుంది..ఓ..ఓ..
ఆకు చాటున పిందె వుంది.. చెట్టు చాటున సిన్నాదుంది
చక్కని చుక్కని టక్కున ఎతికి దక్కించుకోరా..దక్కించుకోరా..
దక్కించుకోరా... దక్కించుకోరా...


అరె సిన్నమ్మీ... 
మబ్బు ఎనక మెరుపుతీగె... దుబ్బు ఎనకా మల్లెతీగె..ఓ..ఓ
మబ్బు ఎనక మెరుపుతీగె... దుబ్బు ఎనకా మల్లెతీగె
ఏడనున్నా దాగోలేవే మల్లెమొగ్గా.. అబ్బో సిగ్గా..
మల్లెమొగ్గా.. అబ్బో సిగ్గా... 

చరణం 1:

ఆహ అత్తారింటికి దారేదమ్మ సందామామా...
ఆమడ దూరం వుందోలమ్మా సందామామా..
ఆహ అత్తారింటికి దారేదమ్మ సందామామా...
అరెరెరే...ఆమడ దూరం వుందోలమ్మా సందామామా

ఆమడ దూరం వున్నాగాని ఎళ్ళాలమ్మా..
ఆమడ దూరం వున్నాగాని ఎళ్ళాలమ్మా..హుయ్

ఎన్నీయల్లో..ఎన్నీయల్లో..సందామామ..హుయ్
సిన్నాదాని మనువు సేయి సందామామా

హోయ్..హోయ్.. సీకటింట్లో చిక్కు తీసా.. వెలుతురింట్లో కొప్పు ముడిసా..
ఓ..ఓ..ఓ..సీకటింట్లో చిక్కు తీసా.. వెలుతురింట్లో కొప్పు ముడిసా
కొప్పులోనా మల్లెపువ్వు గుప్పుమందే..ఒప్పులకుప్పా..
ఓయ్..గుప్పుమందే..ఒప్పులకుప్పా...  

ఎన్నీయల్లో..ఎన్నీయల్లో..సందామామ..హుయ్
సిన్నాదాని మనువు సేయి సందామామా

చరణం 2:

చందమామా రేఖలెన్ని.. కలువపూవు రేకులెన్ని...ఓ..ఓ..ఓ..
చందమామ రేఖలెన్ని.. కలువపూవు రేకులెన్ని...

దానికి దీనికి ఎన్నెన్ని వున్నా.. నీకు నేనే..నాకు నువ్వే..
నీకు నేనే నాకు నువ్వే...
ఆ..ఆ..ఆ..

ఎన్నీయల్లో..ఎన్నీయల్లో..సందామామ..హుయ్
సిన్నాదాని మనువు సేయి సందామామా...
ఎన్నీయల్లో..ఎన్నీయల్లో..సందామామ..హుయ్
సిన్నాదాని మనువు సేయి సందామామా..


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4013




No comments:

Post a Comment