Friday, May 9, 2014

పాడనా వాణి కళ్యాణిగా

చిత్రం : మేఘసందేశం (1982)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలమురళీకృష్ణ


పల్లవి:


ఆ..ఆ..ఆ..ఆ..ఆ..


గమదని సని పామా నిరిగమ రిగ నిరి స

మామాగా గాదప దపమ గానిద నిదప మాదని

సాని గారి సనిద పసాని దపమ

నిసని దపమ నిసని గమదని సని పామరిగా...


పాడనా వాణి కళ్యాణిగా

పాడనా వాణి కళ్యాణిగా

స్వరరాణి పాదాల పారాణిగా

పాడనా వాణి కళ్యాణిగా

నా పూజకూ శర్వాణిగా నా భాషకూ గీర్వాణిగా

శరీర పంజర స్వర ప్రపంచక మధురగాన సుఖవాణిగా

ఆ.. ఆ..


పాడనా వాణి కళ్యాణిగా

పాడనా వాణి కళ్యాణిగా


చరణం 1:


తనువణువణువును తంబుర నాదము నవనాడుల శృతి చేయగా ఆ....


గరిస్స నిదని మద నిదా నిదపద గమ సని దపమ


ఎద మృదంగమై తాళ లయగతులు గమకములకు జతగూడగా

అక్షర దీపారాధనలో స్వరలక్షణ హారతులీయగా

అక్షర దీపారాధనలో స్వరలక్షణ హారతులీయగా

తరంతరము నిరంతరము గానాభిషేకమొనరించి తరించగ


పాడనా వాణి కళ్యాణిగా

పాడనా వాణి కళ్యాణిగా


చరణం 2:


స్వర ముఖరిత నిర్ఝరులు లహరులై దేవి పాదములు కడుగగా


గనిగరి రినిమగ రిగదమ గమనిద గనీరిద మ నిదామగ రి మగారి


లయ విచలిత గగనములు మేఘములై తానములే చేయించగా

సంగీతామృత సేవనలే నిజ సాహిత్యాభినివేశములై

సంగీతామృత సేవనలే నిజ సాహిత్యాభినివేశములై

తరంతరము నిరంతరము గీతాభిషేకమొనరించి తరించగ


పాడనా వాణి కళ్యాణిగా

పాడనా వాణి కళ్యాణిగా

స్వరరాణి పాదాల పారాణిగా

పాడనా వాణి కళ్యాణిగా

నా పూజకూ శర్వాణిగా నా భాషకూ గీర్వాణిగా

శరీర పంజర స్వర ప్రపంచక మధురగాన సుఖవాణిగా

ఆ.. ఆ..


No comments:

Post a Comment