Tuesday, May 13, 2014

తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో

చిత్రం :  మనుషులు మారాలి (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి:


తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం.. హృదయగానం... ఉదయరాగం.. హృదయగానం
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం.. హృదయగానం...ఉదయరాగం.. హృదయగానం
మరల మరల ప్రతియేడు మధుర మధురగీతం...జన్మదిన వినోదం
మరల మరల ప్రతియేడు మధుర మధుర గీతం..జన్మదిన వినోదం


తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం.. హృదయగానం...ఉదయరాగం.. హృదయగానం...


చరణం 1:


వేల వేల వత్సరాలకేళిలో...మానవుడుదయించిన శుభవేళలో..ఓ..
వేల వేల వత్సరాలకేళిలో...మానవుడుదయించిన శుభవేళలో..ఓ..
వీచే మలయమారుతాలు ...పుడమి పలికె స్వాగతాలు
మాలికలై తారకలే...మలిచెకాంతి తోరణాలు..ఓ..ఓ...హోయ్


తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం.. హృదయగానం...ఉదయరాగం.. హృదయగానం...


చరణం 2:


వలపులోన పులకరించు కన్నులతో ...చెలిమి చేరి పలకరించు మగవారు
మనసులోన పరిమళించు వెన్నెలతో...ప్రియుని చూచి పరవశించే ప్రియురాలు
జీవితమే స్నేహమయం... ఈ జగమే ప్రేమమయం.. ప్రేమంటే ఒక భోగం
కాదు కాదు అది త్యాగం ..ఓ..ఓ...హోయ్..


తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం.. హృదయగానం...ఉదయరాగం.. హృదయగానం...

No comments:

Post a Comment