చిత్రం : మయూరి (1985) సంగీతం : బాలు గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: జానకి
పల్లవి:
అందెలు పిలిచిన అలికిడి లో అణువణువున అలజడులూ యద పదమొకటౌ లాహిరిలో... ఎన్నడు ఎరగని వురవడులూ ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల ఇది నా ప్రియ నర్తన వేళ ఆ..ఆ..
చరణం 1:
ఉత్తరాన ఒక ఉరుము వురిమినా ఉలికి చిలిపి మెరుపొకటి మెరిసినా ఉత్తరాన ఒక ఉరుము వురిమినా ఉలికి చిలిపి మెరుపొకటి మెరిసినా ఒక కదలిక చిరు మెదలిక..గిలిగింతగ జనియించగా ఒక కదలిక చిరు మెదలిక..గిలిగింతగ జనియించగా నాలుగు దిక్కుల నడుమ పుడమి నా వేదికగా నటన మాడనా అనంత లయతో నిరంత గతితో జతులు ఆడనా పాడనా
ఇది నా ప్రియ నర్తన వేళ తుది లేనిది జీవన హేల ఇది నా ప్రియ నర్తన వేళ ఆ..ఆ..
No comments:
Post a Comment