Wednesday, May 21, 2014

ఏ తీగ పూవునో.... (sad)

చిత్రం :  మరో చరిత్ర (1978)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు


పల్లవి:


ఏ తీగ పూవునో... ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో ....
ఏ తీగ పూవునో... ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో ...
తెలిసీ తెలియని అభిమానమౌనో....


చరణం 1:


మనసు మూగది.... మాటలు రానిది
మమత ఒకటే ....అది నేర్చినది ...
మనసు మూగది.... మాటలు రానిది
మమత ఒకటే ....అది నేర్చినది ...


భాష లేనిది... బంధమున్నది...
భాష లేనిది... బంధమున్నది...
మన ఇద్దరినీ ...జత కూర్చినదీ...
మన ఇద్దరినీ... జత కూర్చినది....


ఏ తీగ పూవునో... ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో ...
తెలిసీ తెలియని అభిమానమౌనో....


చరణం 2:


వయసే... వయసును పలకరించినది
వలదన్నా ...అది నిలువకున్నది
వయసే... వయసును పలకరించినది
వలదన్నా ...అది నిలువకున్నది ...


చేసిన బాస ...శిలవలె నిలిచి...
చేసిన బాస ...శిలవలె నిలిచి...
చివరికి మంచై కరుగుతున్నది....
చివరికి మంచై కరుగుతున్నది....


ఏ తీగ పూవునో... ఏ కొమ్మ తేటినో
కలిపింది ఏ వింత అనుబంధమౌనో ...
తెలిసీ తెలియని అభిమానమౌనో....

No comments:

Post a Comment