Tuesday, June 24, 2014

మాట రాని మౌనమిది

చిత్రం :  మహర్షి (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :  వెన్నెలకంటి
నేపధ్య గానం : బాలు, జానకి 


పల్లవి:


మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
గానమిది నీ ధ్యానమిది ధ్యానములో నా ప్రాణమిది
ప్రాణమైన మూగ గుండె రాగమిది


మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది


చరణం 1:


ముత్యాల పాటల్లో కోయిలమ్మా ముద్దారబోసేది ఎప్పుడమ్మా
ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మా దీపాలు పెట్టేది ఎన్నడమ్మా


ఈ మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం
ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం
నింగీ నేలా కూడే వేళ.. నీకూ నాకూ దూరాలేలా


అందరాని కొమ్మ ఇది.. కొమ్మచాటు అందమిది
మాట రాని మౌనమిది.. మౌనవీణ గానమిది


చరణం 2:


చైత్రాన కూసేను కోయిలమ్మా గ్రీష్మానికాపాట ఎందుకమ్మా
రేయంత నవ్వేను వెన్నెలమ్మా నీరెండకానవ్వు దేనికమ్మా


రాగాల తీగల్లో వీణానాదం కోరింది ప్రణయ వేదం

వేసారు గుండెల్లో రేగే గాయం పాడింది మధుర గేయం
ఆకాశాన తారాతీరం అంతే లేని ఎంతో దూరం


మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది.. కొమ్మచాటు అందమిది

కూడనిది జత కూడనిది చూడనిది మది పాడనిది
చెప్పరాని చిక్కుముడి వీడనిది


మాట రాని మౌనమిది మౌనవీణ గానమిది
అందరాని కొమ్మ ఇది కొమ్మచాటు అందమిది

No comments:

Post a Comment