Tuesday, June 24, 2014

సుమం ప్రతి సుమం సుమం

చిత్రం : మహర్షి (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :  వెన్నెలకంటి
నేపధ్య గానం :  బాలు, జానకి 


పల్లవి:


తననానననా తననాననా
సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం
జగం అణువణువున కలకలహం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం.. వనం ప్రతి వనం వనం


చరణం 1:


ఆ.... ఆ... ఆ.... ఆ
ఆ.... ఆ... ఆ.... ఆ


వేణువా వీణియా.. ఏవిటీ రాగము
వేణువా వీణియా.. ఏవిటీ రాగము
అచంచలం సుఖం మధుర మధురం
మయం బృదం తరం గిరిజ సురతం
ఈ వేళ నాలో రాగోల్లసాలు...
ఈ వేళ నాలో రాగోల్లసాలు
కాదు మనసా... ఆ....
ప్రేమ మహిమా.. నాదు హృదయం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం... వనం ప్రతి వనం వనం


చరణం 2:


ఆ..
తార రత్తార రతార తారరత్తార రతార...
ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


రంగులే రంగులు అంబరానంతట
రంగులే రంగులు అంబరానంతట
స్వరం నిజం సగం వరము అమరం
వరం వరం వరం చెలియ ప్రణయం
ఆ వేగమేది నాలోన లేదు
ఆ వేగమేది నాలోన లేదు 


ప్రేమమయమూ....  ఆ...
ప్రేమ మయమూ నాదు హృదయం
భానోదయానా చంద్రోదయాలు


సుమం ప్రతి సుమం సుమం... వనం ప్రతి వనం వనం
సుమం ప్రతి సుమం సుమం... వనం ప్రతి వనం వనం
జగం అణువణువునా కలకలహం
భానోదయానా చంద్రోదయాలు
సుమం ప్రతి సుమం సుమం...  వనం ప్రతి వనం వనం


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12403
    

No comments:

Post a Comment