Sunday, June 29, 2014

కుండ కాదు కుండ కాదు

చిత్రం :  భాగ్య చక్రం (1968)
సంగీతం : పెండ్యాల
నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :


కుండ కాదు కుండకాదు చినదానా
నా గుండెలదరగొట్టినావే చినదానా
కుండ కాదు కుండకాదు చినదానా
నా గుండెలదరగొట్టినావే చినదానా


చరణం 1:


పరుగిడితే అందాలన్నీ ఒలికిపోయెనే
తిరిగిచూడ కన్నులలోనా మెరుపు మెరిసినే
ఒలికిన అందాలతో..  మెరిసిన నీ చూపులతో
ఎంత 
లచినావో నన్నూ ఎరుగవైతివి


ఓహో హో..  కుండ కాదు కుండ కాదు చినదానా
నా గుండెలదరగొట్టినావే చినదానా


చరణం 2:


మొదటి చూపులోనే మనసు దోచికొంటివే
ఎదుటపడిన నీ వలపు దాచుకొంటివే
దోచుకున్న నా మనసు దాచుకున్న నీ వలపు
అల్లిబిల్లి అయినాగానీ తెలియవైతివే


ఓహో హో..  కుండ కాదు కుండ కాదు చినదానా
నా గుండెలదరగొట్టినావే చినదానా



చరణం 3:


నన్ను చూచు కోరికతోనే వచ్చినావుగా
నిన్ను చూచు ఆశతోనే వేచినానుగా
వచ్చినట్టే నీ నెపము.. వేచినట్టే నా తపము
ఫలము నిలుపుకొందమన్నా నిలువవైతివే


ఓహో హో.. కుండ కాదు కుండ కాదు చినదానా
నా గుండెలదరగొట్టినావే చినదానా



No comments:

Post a Comment