Sunday, June 29, 2014

కలిసి ఉంటే కలదు సుఖమూ

చిత్రం :  మరో చరిత్ర (1978)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, రమోల


పల్లవి :


కలిసి ఉంటే కలదు సుఖమూ
కలిసి వచ్చిన అదృష్టమూ..శభాష్ !
ఆహ !


కలిసి ఉంటే.. కలిసి ఉంటే కలదు సుఖమూ
కలసి ఉంటే కలదు సుఖమూ
కలిసి వచ్చిన అదృష్టమూ
ఇది కలిసి వచ్చిన అదృష్టమూ


చరణం 1:


కన్నె మనసులూ.. మూగమనసులూ
కన్నె మనసులూ.. మూగమనసులూ
తేనె మనసులూ.. మంచి మనసులూ


కలసి ఉంటే కలదు సుఖమూ
కలిసి వచ్చిన అదృష్టమూ
ఇది కలిసి వచ్చిన అదృష్టమూ


చరణం 2:


మొనగాళ్ళకు మొనగాడూ.. దసరాబుల్లోడు
ప్రేమనగర్ సోగ్గాడూ.. పూలరంగడు
మొనగాళ్ళకు మొనగాడూ.. దసరాబుల్లోడు
ప్రేమనగర్.. సోగ్గాడూ.. పూలరంగడు


పక్కింటి అమ్మాయీ..  గడుసమ్మాయీ
ఆ .. ఛీ..ఏం కాదు !
పక్కింటి అమ్మాయీ..  గడుసమ్మాయీ
అమెరికా అమ్మాయి.. రోజులు మారాయీ


డా..డా...డా..డ్డా... ఆ...డ్డా...
కలసి ఉంటే కలదు సుఖమూ
కలిసి వచ్చిన అదృష్టమూ
ఇది .. అదృష్టమూ


చరణం 3:


మంచివాడు మామకు తగ్గ అల్లుడూ
ఏయ్ ! అలాగా ?
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడూ
అయ్యో పిచ్చి వాడు !
ఏయ్ .. మంచివాడు మామకు తగ్గ అల్లుడూ
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడూ


ఈడూ జోడు.. తోడూ నీడా.. నాడూ నేడు
అహా !
ఈడూ జోడు.. తోడూ నీడా.. నాడూ నేడు
ప్రేమించి చూడూ.. పెళ్ళి చేసి చూడు
అమ్మ బాబోయ్ !
డా..డా...డా..డా..డాడీడాడా....


కలిసి వచ్చిన అదృష్టమూ
ఇది కలిసి వచ్చిన అదృష్టమూ...
ఇది కలిసి వచ్చిన..ఉహు..హు...


No comments:

Post a Comment