Wednesday, June 18, 2014

ఎవరికి తెలుసు చితికిన మనసు

చిత్రం :  మల్లెపువ్వు (1978)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు

పల్లవి:

వలపు కోయిలలు పాడే వసంతం నీ సొంతం
మల్లెల మంటలు రేగిన గ్రీష్మం నా గీతం
పున్నమి పువ్వై నవ్విన వెన్నెల నీ ఆనందం
ఆ వెన్నెలతో చితి రగిలించిన కన్నులు నా సంగీతం

ఆపేసావేం బాబు.. బాగుంది... ఆలపించు..

ఎవరికి తెలుసు.. చితికిన మనసు.. చితిగా రగులుననీ
ఎవరికి తెలుసు..
ఎవరికి తెలుసు.. చితికిన మనసు.. చితిగా రగులుననీ
ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసూ..ఊ..

చరణం 1:

మనసుకు మనసే కరువైతే.. మనిషికి బ్రతుకే బరువనీ
మనసుకు మనసే కరువైతే.. మనిషికి బ్రతుకే బరువనీ
చీకటి మూగిన వాకిట తోడుగ నీడై నా దరి నిలువదనీ
జగతికి హృదయం లేదని..
ఈ జగతికి హృదయం లేదని.. నా జన్మకు ఉదయం లేనే లేదనీ
ఆ..ఆ..

ఎవరికి తెలుసు..
ఎవరికి తెలుసు.. చితికిన మనసు.. చితిగా రగులుననీ
ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసూ..ఊ..

చరణం 2:

గుండెలు పగిలే ఆవేదనలో.. శృతి తప్పినదీ జీవితం
గుండెలు పగిలే ఆవేదనలో.. శృతి తప్పినదీ జీవితం
నిప్పులు చెరిగే నా గీతంలో.. నిట్టూరుపులే సంగీతం
నిప్పులు చెరిగే నా గీతంలో.. నిట్టూరుపులే సంగీతం
ప్రేమకు మరణం లేదని..
నా ప్రేమకు మరణం లేదని.. నా తోటకు మల్లిక లేనే లేదనీ

ఆ..ఆ..

ఎవరికి తెలుసు..
ఎవరికి తెలుసు.. చితికిన మనసు.. చితిగా రగులుననీ
ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని
ఎవరికి తెలుసూ..ఊ..

No comments:

Post a Comment