Friday, June 27, 2014

తెలియని ఆనందం

చిత్రం :  మాంగల్య బలం (1958)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపధ్య గానం :  సుశీల


పల్లవి:

ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..


తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం
పరవశమై పాడేనా హృదయం
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం



చరణం 1:


కలకలలాడెను వసంత వనము
మైమరిపించెను మలయా నిలము

తీయని ఊహల ఊయల లూగి
తేలే మానసము... ఏమో...
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం


చరణం 2:


రోజూ పూచే రోజా పూలు
ఒలికించినవి నవరాగాలు
ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..

పరిచయమైన కోయిల పాటే
కురిసే అనురాగం... ఏమో....
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం


చరణం 3:


అరుణ కిరణముల గిలిగింతలలో
తరగిన తెలిమంచు తెరలే తరలి
ఎరుగని వింతలు ఎదుటే నిలిచి
వెలుగే వికసించే... ఏమో...
తెలియని ఆనందం నాలో కలిగినదీ ఉదయం...


No comments:

Post a Comment