Wednesday, July 30, 2014
ఈ సంజలో
చిత్రం : మూగప్రేమ (1976)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
ఈ సంజలో... కెంజాయలో
ఈ సంజలో... కెంజాయలో..
చిరుగాలులా... కెరటాలలో...
ఈ సంజలో... కెంజాయలో..
చిరుగాలులా... కెరటాలలో...
ఏ మల్లి మరులెల్ల ఎగదోసెనో
ఏ రాజు ఎదలోతు చవిచూసెనో
అహహహా... ఈ సంజలో...
చరణం 1 :
ఆ... ఆ... హా... ఓ... ఓ... హో...
ఈ మేఘమే రాగస్వరమో ఆ...
ఆ రాగమే మూగపదమో ఆ...
ఈ మేఘమే రాగస్వరమో ఆ...
ఆ రాగమే మూగపదమో ఆ...
ఈ చెంగు ఏ వయసు పొంగో ఆ....
ఆ పొంగు ఆర్పేది ఎవరో
ఎవరో అదెవరో రెపరెపరెపరెపరెప
ఈ సంజలో...
చరణం 2 :
ఊ... ఊ... హూ... ఆ... ఆ...హా...
పులకించి ఒక కన్నెమనసు ఆ...
పలికింది తొలి తీపి పలుకు ఊ...
పులకించి ఒక కన్నెమనసు ఆ...
పలికింది తొలి తీపి పలుకు ఊ...
ఓ ఓ...
చిలికింది అది లేత కవిత ఆ...
పొదిగింది తనలోని మమత
మదిలో మమతలో
రిమజిమ రిమజిమ రిమజిమ
ఈ సంజలో...
చరణం 3 :
ఆ... ఆ... హా... ఓ... ఓ... హో...
నా కళ్లలో ఇల్లరికము ఆ...
నా గుండెలో రాచరికము ఆ...
నా కళ్లలో ఇల్లరికము ఆ...
నా గుండెలో రాచరికము ఆ...
నీదేను నీదేను నిజము ఆ...
నేనుంది నీలోన సగము
సగమే జగముగా
కలకలక ల కిలకిలకి ల
ఈ సంజలో... కెంజాయలో....
చిరుగాలులా... కెరటాలలో...
ఏ మల్లి మరులెల్ల ఎగదోసెనో
ఏ రాజు ఎదలోతు చవిచూసెనో
అహహహా...
అహహహా... ఈ సంజలో...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2351
Monday, July 28, 2014
బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
చిత్రం : ముహూర్త బలం (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోయిందా
బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోయిందా
కోరుకున్న చిన్న దాన్ని గుండెలోన ఏముందో
కొంచెమైన తెలుసుకున్నావా ఆ ఆ ఆ...
బుగ్గ గిల్ల గానే సరిపోలేదు
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోలేదు
బుగ్గ గిల్ల గానే సరిపోలేదు
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోలేదు
నీ కొంగు నా కొంగు ఏకంగా ముడి వేసే
వేళ కోసం వేచి ఉన్నాను ఊ ఊ ఊ....
బుగ్గ గిల్ల గానే సరిపోలేదు
గిలి గిలి గిలి నవ్వగానే సరిపోలేదు
చరణం 1 :
ముత్యాల పందిరి వేసి..రత్నాల పీట వేసి
బంగారు చేతులతో... బాసికం కడతావా...
మనసే ఒక పందిరి చేసి మమతలనే పీట వేసి
మురిపించే చేతులతో..మూడు ముళ్ళు వేస్తానే..
నీ జోడు కూడి వస్తానే...
బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
గిలి గిలి గిలి గిలి నవ్వగానే సరిపోలేదు
చరణం 2 :
కన్నె పిల్ల వలపంటే..వెన్నపూస లాంటిది
కాస్త వేడి సోకిందా... కరిగి పోతానంటదీ...
చల చల్లని కళ్ళల్లో..మెల మెల్లగా దాచుకుంటే
వెన్న లాంటి ఆ వలపే..వేడి తగలకుంటదీ..
నా నీడ లాగ ఉంటదీ...
బుగ్గ గిల్ల గానే సరిపోయిందా
గిలి గిలి గిలి గిలి నవ్వగానే అయిపోయిందా
బుగ్గ గిల్ల గానే సరిపోలేదు
గిలి గిలి గిలి గిలి నవ్వగానే అయిపోలేదు
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3516
Labels:
(మ),
కె.వి. మహదేవన్,
బాలు,
ముహూర్త బలం (1969),
సినారె,
సుశీల
నీ లీల పాడెద దేవా
చిత్రం : మురిపించే మువ్వలు (1962)
సంగీతం : ఎస్. ఎం. సుబ్బయ్య నాయుడు
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : జానకి
పల్లవి :
ఆ...ఆ...ఆ...ఆ...
నీ లీల పాడెద దేవా
మనవి ఆలించ వేడెద దేవా
నను లాలించు మా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా
నీ లీల పాడెద దేవా ....
సింధూర రాగంపు దేవా...
ఆ..ఆ..ఆఆ.. ఆ..ఆ..ఆ. ఆఆ
దివ్య శృంగార భావంపు దేవా...
మళ్ళి చెలువాలు నిను కోరు నీవు రావా...
ఎలనీ.. నీ లీల పాడెద దేవా...
చరణం 1 :
అనుపమ వరదాన శీల...ఆ...
అనుపమ వరదాన శీల ...
వేగ కనుపించు కరుణాలవాల...
ఎలనీ నీ లీల పాడెద దేవా...
చరణం 2 :
నీ లీల పాడెద దేవా...
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా..
నీ లీల పాడెద దేవా....
సగమపని నీ లీల పాడెద దేవా...
నిస్సనిదపమ గామగరిసనీ సానిగదమపా మగరిస నిదమప గరిని...
నీ లీల పాడెద దేవా....
సా రిస్సా నిసరిస్సా నినిస పపనినిసా మమపపనినిసా గగస గగస నినిస పపని మమప గగమమపపనినిసస గరిని....
పా నిదపమగరిసని సగగసగగ సగమప గరిసని సగసా...
నినిప మమప నిపనిపసా పనిపసా నిదపమగరి సగసా ....
గామపనిసా నిసగరిసరిని ససనీ నిసదని ససని...
గరిని గరిగ నిరిగరి నిగరిని
నిరిని నిసస నిరిని నిసస నిదప
నిరినిసా ఆ..ఆ ఆ..ఆ
రినీసపానిసాపసామపనిసరీ ఆ...ఆ..ఆ..
సానిపాని ససనీ ససనీ
పానిపస పానిదనీ మాదనిపానిదనీసరిసా
పానిదనిసరిసా...మగాపమ
సాసరిని నీసరిపా సాసని సాససాససాస సరి గరిసని సరిగరిస
రిదనిదపా పనిమప నిదపమ తతదరి సగమప పనిమప సనిదనిపనిప పనిమప గరినిసదనిమపని ...
నీ లీల పాడెద దేవా
నను లాలించు నా ముద్దు దేవా
నీ లీల పాడెద దేవా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=7015
వస్తాడమ్మా నీ దైవమూ
చిత్రం : మురళీకృష్ణ (1964)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
వస్తాడమ్మా నీ దైవమూ.. వస్తుందమ్మా వసంతమూ
వస్తాడమ్మా నీ దైవమూ.. వస్తుందమ్మా వసంతమూ
కలలే నిజమై వలపే వరమై
కళ కళ లాడును జీవితము
వస్తాడమ్మా నీ దైవమూ వస్తుందమ్మా వసంతమూ
చరణం 1 :
పేరే కాదు ప్రేమకు కూడా శ్రీకృష్ణుడమ్మా నీ ప్రియుడు
పేరే కాదు ప్రేమకు కూడా శ్రీకృష్ణుడమ్మా నీ ప్రియుడు
తన ముద్దుల మురళిగ నిను మార్చి
తన ముద్దుల మురళిగ నిను మార్చి
మోహనరాగం ఆలపించును
వస్తాడమ్మా నీ దైవమూ వస్తుందమ్మా వసంతమూ
చరణం 2 :
పసిపాపవలే నిను ఒడి చేర్చి కనుపాపవలే కాపాడును
పసిపాపవలే నిను ఒడి చేర్చి కనుపాపవలే కాపాడును
నీ మనసే మందిరముగ చేసీ.. ఈ ...
నీ మనసే మందిరముగ చేసి దైవం తానై వరములిచ్చును
వస్తాడమ్మా నీ దైవమూ వస్తుందమ్మా వసంతమూ
చరణం 3 :
ఎక్కడివాడో ఇక్కడి వాడై దక్కినాడు నీ తపసు ఫలించి
ఎక్కడివాడో ఇక్కడి వాడై దక్కినాడు నీ తపసు ఫలించి
నాడొక చెట్టును మోడు చేసినా ఆ వాడే మోడుకు చిగురు పూర్చును
వస్తాడమ్మా నీ దైవమూ వస్తుందమ్మా వసంతమూ
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1092
కనులు కనులు కలిసెను
చిత్రం : మురళీకృష్ణ (1964)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి :
కనులు కనులు కలిసెను... కన్నె వయసు పిలిచెను
కనులు కనులు కలిసెను... కన్నె వయసు పిలిచెను
విసురులన్ని పైపైనే... అసలు మనసు తెలిసెను...
అసలు మనసు తెలిసెను
చరణం 1 :
ముఖము పైన ముసురుకున్న ముంగురులే అందము
ముఖము పైన ముసురుకున్న ముంగురులే అందము
సిగ్గు చేత ఎర్రబడిన బుగ్గలదీ అందము
కోరిన చిన్న దాని కోర చూపే అందము కోర చూపే అందము
కనులు కనులు... మనసు తెలిసెను
విసురులన్ని పైపైనే... అసలు మనసు తెలిసెను...
అసలు మనసు తెలిసెను
చరణం 2 :
దొండపండు వంటి పెదవి పిండుకొనుట ఎందుకు
దొండపండు వంటి పెదవి పిండుకొనుట ఎందుకు
ముచ్చటైన పైటకొంగు ముడులు వేయుటెందుకు
పోవాలనుకొన్నా పోలేవు ముందుకు.. పోలేవు ముందుకు
కనులు కనులు... మనసు తెలిసెను
విసురులన్ని పైపైనే... అసలు మనసు తెలిసెను...
అసలు మనసు తెలిసెను
చరణం 3 :
నడచినంత పిడికెడంత నడుము వణకిపోవును
నడచినంత పిడికెడంత నడుము వణకిపోవును
కసురుతున్న మనసులోనే మిసిమి వలపులూరును
కలిగిన కోపమంత కౌగిలిలో తీరును కౌగిలిలో తీరును
కనులు కనులు... మనసు తెలిసెను
విసురులన్ని పైపైనే... అసలు మనసు తెలిసెను...
అసలు మనసు తెలిసెను...
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1083
నీ సుఖమే నే కోరుతున్నా
చిత్రం : మురళీకృష్ణ (1964)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి :
ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా.. నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా
చరణం 1 :
అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్నీ
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని
నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..
చరణం 2 :
పసిపాపవలె ఒడి జేర్చినాను కనుపాప వలె కాపాడినాను
గుండెను గుడిగా చేసాను.....
గుండెను గుడిగా చేసాను.. నువ్వుండలేనని వెళ్ళావు
నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..
వలచుట తెలిసిన నా మనసునకు మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే... మన్నించుటయే రుజువు కదా
నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..
చరణం 3 :
నీ కలలే కమ్మగ పండనీ... నా తలపే నీలో వాడనీ
కలకాలం చల్లగ వుండాలనీ.. దీవిస్తున్నా నా దేవిననీ.. దీవిస్తున్నా నా దేవిని
ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నే కోరుతున్నా ..నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుతున్నా..
Saturday, July 26, 2014
ఊఁ అను.. ఊహూ అను
చిత్రం : మురళీకృష్ణ (1964)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
ఊఁ అను.. ఊహూ అను.. ఔనను ఔనౌనను
నా వలపంతా నీదని.. నీదేనని.. ఊఁ అనూ
ఊఁ అను.. ఊహూ అను.. ఔనను ఔనౌనను
నా వెలుగంతా నీవని.. నీవేనని.. ఊఁ అనూ
చరణం 1:
కలకల నవ్వే కలువకన్నులు..
కలకల నవ్వే కలువకన్నులు..
వలపులు తెలుపుటకే కాదా
పక్కన నిలిచిన చక్కని రూపము
చక్కిలిగింతలకే కాదా
చక్కిలిగింతలకే కాదా
ఊఁ అను.. ఊహూ అను.. ఔనను ఔనౌనను
చరణం 2:
పచ్చని ఆశల పందిరి నీడల వెచ్చగ కాపురముందామా
అహహా అహహా అహహా ఆ... ఆ... ఆ...
పచ్చని ఆశలపందిరి నీడల వెచ్చగ కాపురముందామా
కౌగిలి వీడక కాలము చూడక కమ్మని కలలే కందామా..
ఆఁ...
ఆఁ... కమ్మని కలలే కందామా
ఊఁ అను.. ఊహూ అను.. ఔనను ఔనౌనను
చరణం 3 :
మణిదీపాలై మదిలో వెలిగే అనురాగాలు మనవేలే
ఓ... ఓ... ఓ... ఓ...
మణిదీపాలై మదిలో వెలిగే అనురాగాలు మనవేలే
చిరునవ్వులతో చిగురులు తొడిగే జీవితమంటే మనదేలే
ఊఁ...
ఊఁ... జీవితమంటే మనదేలే
ఊఁ అను.. ఊహూ అను
ఔనను.. ఔనౌనను
నా వలపంతా నీదని..
నా వెలుగంతా నీవని..
ఊఁ అను.. ఊహూ అను
ఔనను.. ఔనౌనను
ఊఁ అనూ... హహహహ
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1573
Labels:
(మ),
ఘంటసాల,
మాస్టర్ వేణు,
మురళీకృష్ణ (1964),
సినారె,
సుశీల
చిటపట చినుకుల మేళం
చిత్రం : ముద్దుల కొడుకు (1979)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
అందమైన అనుభవాలకు ఇదే ఆదితాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
జోరు మీద మోగింది జోడు సన్నాయి మేళం
అందమైన అనుభవాలకు ఇదే ఆదితాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చరణం 1 :
వాన చినుకు కాటేస్తే.. వయసు నిన్ను వాటేస్తే
వలపుటేరు పోటొస్తే.. వరద గట్లు తెగుతుంటే
వాన చినుకు కాటేస్తే.. వయసు నిన్ను వాటేస్తే
వలపుటేరు పోటొస్తే.. వరద గట్లు తెగుతుంటే
ముద్దముద్దగా తడిసి.. ముద్దుముద్దుగా కలిసి
ముద్దముద్దగా తడిసి.. ముద్దుముద్దుగా కలిసి
ఇద్దరమా ఒక్కదనం ఇచ్చిపుచ్చుకుంటుంటే
తహతహ తహతహ తహతహలో
తహతహ తహతహ తహతహలో
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చరణం 2 :
వడగళ్ళ వానలో.. వడగాలి దెబ్బలు
మనసున్న కళ్ళకే.. మసకేసే మబ్బులు
వడగళ్ళ వానలో.. వడగాలి దెబ్బలు
మనసున్న కళ్ళకే.. మసకేసే మబ్బులు
బిగిసే కౌగిళ్ళలో.. ఒకటే తబ్బిబ్బులు... హాయ్
బిగిసే కౌగిళ్ళలో.. ఒకటే తబ్బిబ్బులు
వయసున్న వాళ్ళకే.. వల్లమాలిన జబ్బులు
తహతహ తహతహ తహతహలో
తహతహ తహతహ తహతహలో
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
ఆ.. ఆ... చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చరణం 3 :
చలి మంటై సెగపెడుతుంటే.. చెలి జంటై సగమౌతుంటే
చలి మంటై సెగపెడుతుంటే.. చెలి జంటై సగమౌతుంటే
మన కోసం ప్రతి మాసం.. మాఘమాసమై పోతుంటే
మన ఇద్దరి మధ్యన ఏదో.. హద్దు వద్దు వద్దంటుంటే
మన ఇద్దరి మధ్యన ఏదో.. హద్దు వద్దు వద్దంటుంటే
ఈ వద్దుకు అర్ధం మారి మన హద్దులు రద్దౌతుంటే
తహతహ తహతహ తహతహలో
తహతహ తహతహ తహతహలో
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
జోరుమీద మోగింది జోడు సన్నాయి మేళం
అందమైన అనుభవాలకు ఇదే ఆదితాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
చిటపట చినుకుల మేళం.. తడిపొడి తపనల తాళం
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1783
Labels:
(మ),
ANR,
కె.వి. మహదేవన్,
బాలు,
ముద్దుల కొడుకు (1979),
వేటూరి,
సుశీల
సురుచిర సుందర వేణి
చిత్రం : ముద్దుల కృష్ణయ్య (1986)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
సురుచిర సుందర వేణి...
మధుమయ మంజుల వాణి..
ఆ.. ఆ...ఆ..
సురుచిర సుందర వేణి...
మధుమయ మంజుల వాణి..
ప్రణయ వేదమాలపించనీ.. హృదయరమ్య మదనసీమ పాలించనీ
నిను లాలించనీ....
సురుచిర సుందర వేణి..
మధుమయ మంజుల వాణి
ప్రణయ వేదమాలపించనీ..
హృదయరమ్య మదనసీమ పాలించనీ.. నిను లాలించనీ....
సురుచిర సుందర వేణి..
మధుమయ మంజుల వాణి..
చరణం 1 :
గలభాస్వర లలితస్వర పదసుందర లయబంధుర చలనమ్ములో సాగిపోనీ...
రజనీకర హిమశీకర సుమనోహర కిరణాంతర రసడోలలో ఊగిపోనీ ...
జలరాశులన్ని చెలరేగినా.. విలయాగ్నులన్నీ విషమించినా
జగదేక వీరుడనై ఏలుకొని.. నిన్నేలుకోనీ...
సురుచిర సుందర వేణి..
మధుమయ మంజుల వాణి..
ప్రణయ వేదమాలపించనీ..
హృదయరమ్య మదనసీమ పాలించనీ నిను లాలించనీ....
సురుచిర సుందర వేణి..
మధుమయ మంజుల వాణి..
చరణం 2:
ప్రతి దృశ్యం శత పత్రం.. ప్రతి వచనం శృతి రుచిరం..
బ్రతుకంత ప్రసరించిపోనీ..
ప్రతి కణమొక మణిముకురం..
ప్రతి కలియిక మధుమధురం ...
ప్రణయాభ్ధి ఉప్పొంగిపోనీ..
పలనాటి వీరా కళభాషణా...
నా బాలచంద్రా నవ మోహనా ...
మాంచాలనై నేనుండి పోనీ మది నిండిపోనీ
సురుచిర సుందర వేణి..
మధుమయ మంజుల వాణి..
ప్రణయ వేదమాలపించనీ..
హృదయరమ్య మదనసీమ పాలించనీ నిను లాలించనీ....
అహాహాహా అహాహాహహ
అహాహాహా అహాహాహహ
మేఘమా... నీలి మేఘమా
చిత్రం : బహుదూరపు బాటసారి (1983)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
మేఘమా... నీలి మేఘమా..
మేఘమా... నీలి మేఘమా
ఉరమకే.. మెరవకే నీలి నీలి మేఘమా
మేఘమా.. నీలి మేఘమా
ఉన్న రూపం మార్చుకుని.. నిన్ను నువ్వే కాల్చుకుని
వానవై కురవకే త్యాగమై కరగకే.. మేఘమా.. నీలి మేఘమా...
చరణం 1 :
ఫ్రతి ప్రసవం గండమని.. ప్రతి నిముషం మరణమని.. తెలిసి కూడ కన్నతల్లులు..
ఫ్రతి ప్రసవం గండమని.. ప్రతి నిముషం మరణమని.. తెలిసి కూడ కన్నతల్లులు..
మరల మరల కంటారు.. పగటి కలలు కంటారు.. బిడ్డ దైవం అంటారు
దైవమే రాయి అని ఉలుకు పలుకు లేనిదని తెలుసుకోరు పిచ్చి తల్లులు
మేఘమా.. నీలి మేఘమా ఉరమకే.. మెరవకే.. నీలి నీలి మేఘమా..
మేఘమా.. నీలి మేఘమా...
చరణం 2:
సాగరమే సంసారమని.. ఈదటమే కష్టమని.. మరచిపోయి కన్న తండ్రులు
సాగరాన పయనిస్తారు... మునిగి తేలుతుంటారు
మునకే మిగులునని.. కన్నందుకు ఫలితమని తెలుసుకోరు పిచ్చి తండ్రులు
మేఘమా నీలి మేఘమా.. ఉరమకే మెరవకే.. నీలి నీలి మేఘమా..
మేఘమా... నీలి మేఘమా...
ఉన్న రూపం మార్చుకుని.. నిన్ను నువ్వే కాల్చుకుని
వానవై కురవకే త్యాగమై కరగకే.. మేఘమా.. నీలి మేఘమా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1386
ఎవరు ఎవరో తెలియకుండా
చిత్రం : బహుదూరపు బాటసారి (1983)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఎవరు ఎవరో తెలియకుండా.. ఒకరినొకరు కలుసుకొనుట.. ఆ.. ఆ..
చిత్రం.. విచిత్రం... చిత్రం.. విచిత్రం
చిత్రమైన సృష్టిలో.. ఆడమగ కలయికే...
చిత్రమైన సృష్టిలో.. ఆడమగ కలయికే..
చిత్రం.. విచిత్రం... చిత్రం.. విచిత్రం
చరణం 1 :
కన్ను కన్ను కలిసినాక.. పిచ్చిపట్టి తిగురుతుంటే...
దాహం.. దాహం.. దాహం.. దాహం.. దాహం.. దాహం...
దిక్కులన్నీ పూలు పరచి పిల్లలల్లే ఎగిరిపడితే...
సరసం.. సరసం.. సరసం.. సరసం.. సరసం.. సరసం..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ..
ఎదురు చూసి కనులు రెండూ.. తెల్లవారి ఎర్రబారితే...
విరహం... విరహం... విరహం... విరహం... విరహం... విరహం... విరహం...
చనువు పెరిగి అలకలేసి... అలిగి అలిగి పారిపోతే...
కలహం.. కలహం... కలహం.. కలహం.. కలహం.. కలహం..
లల్లలల్లలా.. ఆహహా... ఆహహా... ఓహో.. ఆహహా..
దాహాల చెరువుల్లో.. సరసాల వానల్లో
విరహాలు.. కలహాలు.. కమ్మని ప్రేమకు చిగురులు..
ఎవరు ఎవరో తెలియకుండా.. ఒకరినొకరు కలుసుకొనుట....
చిత్రం.. విచిత్రం..
చరణం 2 :
అడుగులోన అడుగు వేసి.. ఏడడుగులు నడుస్తుంటే..
ధన్యం.. జన్మ ధన్యం.. ధన్యం.. జన్మ ధన్యం.. ధన్యం.. జన్మ ధన్యం..
ఆరుబయట చందమామ రారమ్మని పిలుస్తుంటే..
ధ్యానం.. పరధ్యానం.. ధ్యానం.. పరధ్యానం.. ధ్యానం.. పరధ్యానం..
తారలన్ని తోరణాలై.. తొలి రాతిరి కాపు కాస్తే..
మైకం.. మైకం.. మైకం.. మైకం.. మైకం.. మైకం..
సిగ్గు విడిచి చీకటంత.. నవ్వి నవ్వి తెల్లవార్చితే...
స్వర్గం.. స్వర్గం..
స్వప్నాల మైకం లో.. స్వర్గాల ఊయలలో..
రాగాలు.. భావాలు.. కమ్మని కాపురాన కబురుళ్లు...
ఎవరు ఎవరో తెలియకుండా.. ఒకరినొకరు కలుసుకొనుట.. ఆ.. ఆ..
చిత్రం.. విచిత్రం.. చిత్రం.. విచిత్రం..
చిత్రమైన సృష్టిలో ఆడమగ కలయికే...
చిత్రం.. విచిత్రం.. చిత్రం.. విచిత్రం..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1910
Tuesday, July 22, 2014
చూడాలని ఉంది..
చిత్రం : ముద్దుబిడ్డ (1956)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం : సుశీల
పల్లవి:
చూడాలని ఉంది..
అమ్మా.. చూడాలని ఉంది..
నిన్నూ.. చూడాలని ఉంది
పొరపాటు పనులిక చేయబోనని నీతో చెప్పాలి
అమ్మా.. చూడాలని ఉంది..
చరణం 1:
కంటికి నిద్దర రాదే.. నే తింటే నోటికిపోదే
చేశా చిన్న తప్పు.. నువ్వు వేశావెంతో ఒట్టు
ఒకసారి మాత్రం నిన్ను చూస్తే చాలులే.. అమ్మా..
చూడాలని ఉంది.. నిన్నూ చూడాలని ఉంది
చరణం 2:
కాళ్ళు అటే పోయేనే.. నా కళ్ళు అటే లాగేనే
చూడకపోతే దిగులు.. నిన్ను చూస్తే ఏమౌతావో...
చూడటం మరి కూడదంటే.. మరి ఏడుపొస్తుందమ్మ
చూడాలని ఉంది..
అమ్మా.. చూడాలని ఉంది..
నిన్నూ.. చూడాలని ఉంది
పొరపాటు పనులిక చేయబోనని నీతో చెప్పాలి
అమ్మా.. చూడాలని ఉంది..
జయ మంగళ గౌరీ దేవి
చిత్రం : ముద్దుబిడ్డ (1956)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం : పి. లీల
పల్లవి:
జయ మంగళ గౌరీ దేవి
జయ మంగళ గౌరీ దేవి
దయ చూడుము చల్లని తల్లీ
జయ మంగళ గౌరీ దేవి
చరణం 1:
కొలిచే వారికి కొరతలు లేవు
కలిగిన బాధలు తొలగ జేయు
కాపురమందున కలతలు రావు
కమ్మని దీవెనలిమ్మా.. అమ్మా..
జయ మంగళ గౌరీ దేవి
దయ చూడుము చల్లని తల్లీ
జయ మంగళ గౌరీ దేవి
చరణం 2:
ఇలవేలుపువై వెలసిన నాడే
నెలకొలిపావు నిత్యానందం
ఆ ఆ ఆ ఆ ఆ .......
నెలకొలిపావు నిత్యానందం
నోచే నోములు పండించావు
చేసే పూజకె కొమ్మా.. అమ్మా..
జయ మంగళ గౌరీ దేవి
చరణం 3:
గారాబముగా గంగ నీవు
బొజ్జ గణపతిని పెంచిరి తల్లీ
ఇద్దరి తల్లుల ముద్దులపాపకి
బుద్ధీ జ్ఞానములిమ్మా.. అమ్మా..
జయ మంగళ గౌరీ దేవి
దయ చూడుము చల్లని తల్లీ
జయ మంగళ గౌరీ దేవి
Labels:
(మ),
ఆరుద్ర,
పి. లీల,
పెండ్యాల,
ముద్దుబిడ్డ (1956)
Monday, July 21, 2014
అలివేణీ ఆణిముత్యమా
చిత్రం : ముద్దమందారం (1981)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి
పల్లవి:
అలివేణీ ఆణిముత్యమా
నీ కంట నీటి ముత్యమా
ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో
స్వాతివాన లేత ఎండలో
జాలినవ్వు జాజి దండలో..
అలివేణీ ఆణిముత్యమా
నా పరువాల ప్రాణ ముత్యమా
జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో
స్వాతివాన లేత ఎండలో
జాజిమల్లీ పూలగుండెలో
అలివేణీ ఆణిముత్యమా...
చరణం 1:
కుదురైన బొమ్మకి.. కులుకుమల్లె రెమ్మకి
కుదురైన బొమ్మకి.. కులుకుమల్లె రెమ్మకి
నుదుట ముద్దు పెట్టనా.. బొట్టుగా
వద్దంటే ఒట్టుగా...
అందాల అమ్మకి కుందనాల కొమ్మకి
అందాల అమ్మకి కుందనాల కొమ్మకి
అడుగు మడుగులొత్తనా.. మెత్తగా...
ఔనంటే తప్పుగా...
అలివేణీ ఆణిముత్యమా
నా పరువాల ప్రాణ ముత్యమా
చరణం 2:
పొగడలేని ప్రేమకి పొన్నచెట్టు నీడకి
పొగడలేని ప్రేమకి పొన్నచెట్టు నీడకి
పొగడదండలల్లుకోనా పూజగా...
పులకింతల పూజగా...
తొలిజన్మల నోముకి.. దొర నవ్వుల సామికి
తొలిజన్మల నోముకి.. దొర నవ్వుల సామికి
చెలిమై నేనుండిపోనా చల్లగా...
మరుమల్లెలు చల్లగా...
అలివేణీ ఆణిముత్యమా
నీ కంట నీటి ముత్యమా
జాబిలి చలువో.. ఇది వెన్నెల కొలువో
స్వాతివాన లేత ఎండలో
జాజిమల్లీ పూలగుండెలో..
అలివేణీ ఆణిముత్యమా...
అలివేణీ... ఆణిముత్యమా...
Labels:
(మ),
జానకి,
బాలు,
ముద్దమందారం (1981),
రమేశ్ నాయుడు,
వేటూరి
ముత్యమంతా పసుపు
చిత్రం : ముత్యాల ముగ్గు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం : సుశీల
పల్లవి:
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా
ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన
మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
చరణం 1:
ఆరనయిదో తనము ఏ చోట నుండు
అరుగులలికే వారి అరచేతనుండు
ఆరనయిదో తనము ఏ చోట నుండు
అరుగులలికే వారి అరచేతనుండు
తీరైన సంపదా ఎవరింట నుండు..
తీరైన సంపదా ఎవరింట నుండు...
దిన దినము ముగ్గున్న లోగిళ్ళనుండు
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ
చరణం 2:
కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు
కోరి కొలిచేవారి కొంగు బంగారూ..
కోటలో తులిసెమ్మ కొలువున్న తీరు
కోరి కొలిచేవారి కొంగు బంగారూ..
గోవు మాలక్ష్మికి కోటి దండాలు..
గోవు మాలక్ష్మికి కోటి దండాలు..
కోరినంత పాడి నిండు కడవళ్ళూ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ
చరణం 3:
మగడు మెచ్చిన చాన కాపురంలోన
మొగలి పూల గాలి ముత్యాల వాన
మగడు మెచ్చిన చాన కాపురంలోన
మొగలి పూల గాలి ముత్యాల వాన
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటి ఇల్లాలికి ఎంత సౌభాగ్యం
ఇంటిల్లిపాదికి అంత వైభోగం
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా
ముద్దు మురిపాలొలుకు ముంగిళ్ళలోన
మూడు పువ్వులు ఆరు కాయల్లు కాయ
ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ
ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=4701
నిదురించే తోటలోకి
చిత్రం : ముత్యాల ముగ్గు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : గుంటూరు శేషంధ్రశర్మ
నేపథ్య గానం : సుశీల
పల్లవి:
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది
చరణం 1:
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లిందీ
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ
శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపిందీ
ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది
నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చిందీ
కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చింది
చరణం 2:
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినపడీ అంతలో పోయాయి
కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని
నావకు చెప్పండీ.. నావకు చెప్పండి
గోగులు పూచే
చిత్రం : ముత్యాల ముగ్గు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి:
గోగులు పూచే.. గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి
గోగులు దులిపే వారెవరమ్మ ఓ లచ్చ గుమ్మాడి
గోగులు పూచే..గోగులు కాచే ఓ లచ్చ గుమ్మాడి
గోగులు దులిపే వారెవరమ్మ ఓ లచ్చ గుమ్మాడి
ఓ లచ్చ గుమ్మాడి..ఓ లచ్చ గుమ్మాడి..ఈ..ఈ ఓ లచ్చ గుమ్మాడి
పొద్దు పొడిచే పొద్దు పొడిచే..ఓ లచ్చా గుమ్మాడి
పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసే..ఓ లచ్చా గుమ్మాడి
పొద్దు కాదది.. నీ... ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే....సుమా..
పొద్దు కా..ఆ.దది.. నీ..ఈ..ముద్దు మోమున దిద్దిన కుంకుమ తిలకమే...సుమా..
వెలుగులు కావవి..నీ పాదాలకు అలదిన పారాణీ..
ఆహ.. హ..జిలుగులే సుమా..ఆ..ఆ
చరణం 1:
ముంగిట వేసిన ముగ్గులు చూడు ..ఓ లచ్చా గుమ్మాడి
ముత్యాలా ముగ్గులు చూడు .. ఓ లచ్చా గుమ్మాడి
ముంగిలి కాదది..నీ అడుగులలో పొంగిన పాల కడలియే సుమా..
ముంగిలి కాదది..నీ అడుగులలో పొంగిన పాల కడలియే సుమా..
ముగ్గులు కావవి..నా అంతరంగాన పూచిన రంగవల్లులే..సుమా..ఆ..ఆ
చరణం 2:
మల్లెలు పూచే మల్లెలు పూచే ..ఓ లచ్చా గుమ్మాడి
వెన్నెల కాచే వెన్నెల కాచే ..ఓ లచ్చా గుమ్మాడి..
మల్లెలు మల్లెలు పూచే ..ఓ లచ్చా గుమ్మాడి
వెన్నెల కాచే వెన్నెల కాచే ..ఓ లచ్చా గుమ్మాడి..
మల్లెలు కావవి నా మహలక్ష్మి విరజల్లిన సిరినవ్వులే..సుమా..
మల్లెలు కావవి నా మహలక్ష్మి విరజల్లిన సిరినవ్వులే.... సుమా..
వెన్నెల కాదది వేళ తెలిసి..ఆ జాబిలి వేసిన పానుపే.... సుమా..
ఏదో ఏదో అన్నది
చిత్రం : ముత్యాల ముగ్గు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం : రామకృష్ణ
పల్లవి:
ఏదో ఏదో అన్నది.. ఈ మసకవెలుతురు..ఊ..ఊ
గూటి పడవలో విన్నది..కొత్త పెళ్ళికూతురు..ఊ
ఏదో ఏదో అన్నది.. ఈ మసకవెలుతురు..ఊ..ఊ
గూటి పడవలో విన్నది..కొత్త పెళ్ళికూతురు..ఊ
చరణం 1:
ఒదిగి ఒదిగి కూచుంది.. బిడియపడే వయ్యారం..
ముడుచుకునే కొలది మరీ మిడిసి పడే సింగారం..
సోయగాల విందులకై.. వేయి కనులు కావాలీ..
ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..
ఏదో ఏదో అన్నది.. ఈ..మసకవెలుతురు..
గూటి పడవలో విన్నది.. కొత్త పెళ్ళికూతురు..
చరణం 2:
నింగిలోని వేలుపులు.. ఎంత కనికరించారో..ఓ..ఓ
నిన్ను నాకు కానుకగా... పిలిచి కలిమి నొసగేరూ..ఊ..ఊ
పులకరించు మమతలతో.. పూల పాన్పు వేశారూ..ఊ..ఊఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..
ఏదో ఏదో అన్నది.. ఈ..ఈ.. మసకవెలుతురు..ఊ..ఊ
గూటి పడవలో విన్నది..కొత్త పెళ్ళికూతురు..ఊ
ఆ..ఆ..ఆ.ఆ..ఆ
ఊఁ..ఊఁ..ఊఁ..ఊఁ..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=4700
ఎంతటి రసికుడవో
చిత్రం : ముత్యాల ముగ్గు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : సుశీల
పల్లవి:
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా
నీవెంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా
నీ వింతలు ఇంతలు ఇంతలై
కవ్వింతలై మరులొలికెరా..ఆ..ఆ..ఆ
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా
నీ వింతలు ఇంతలు ఇంతలై
కవ్వింతలై మరులొలికెరా..ఆ..ఆ..ఆ
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా
చరణం 1:
గుత్తపు రవిక వోయమ్మో..ఓ..
చెమట చిత్తడిలో తడిసి ఉండగా..ఆ..ఆ..ఆ..ఆ
గుత్తపు రవిక వోయమ్మో..ఓ..
చెమట చిత్తడిలో తడిసి ఉండగా..
ఎంతసేపు... నీ తుంటరి చూపు
ఎంతసేపు... నీ తుంటరి చూపు
ఎంతసే...పు... నీ తుంటరి చూపు
అంతలోనే తిరగాడుచుండగా..
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా
నీ వింతలు ఇంతలు ఇంతలై
కవ్వింతలై మరులొలికెరా..ఆ..ఆ..ఆ
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా
చరణం 2:
మోము మోమున ఆనించి.. ఏవో ముద్దు ముచ్చుటలాడబోవగా..ఆ..ఆ..ఆ
మోము మోమున ఆనించి.. ఏవో ముద్దు ముచ్చుటలా..డ..బోవగా..ఆ..ఆ..అ
మోము మోమున ఆనించి.. ముద్దు ముచ్చుటలాడబోవగా..ఆ..ఆ..అ
రక్కున కౌగిట చిక్కబట్టి
రక్కున కౌగిట చిక్కబటి
నా..ఆ..ఆ చెక్కిలి మునిపంట నొక్కుచుండగా..ఆ
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా
నీ వింతలు ఇంతలు ఇంతలై
కవ్వింతలై మరులొలికెరా..ఆ..ఆ..ఆ
ఎంతటి రసికుడవో..ఓ..ఓ..ఓ తెలిసెరా..ఆ.
తెలిసెరా..తెలిసెరా..తెలిసెరా..రా..ఆ..ఆ
సన్నజాజికి గున్నమావికి
చిత్రం : ముత్యాల పల్లకి (1976)
సంగీతం : సత్యం
గీతరచయిత : మల్లెమాల
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి:
సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...
మాటామంతి లేని వేణువు పాట పాడిందీ..
సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...
మాటామంతి లేని వేణువు పాట పాడిందీ..
హా..హా...హా....ఆ హా...హా
గున్న మావికి సన్నజాజికి పెళ్లి కుదిరింది..
నాదే గెలుపని మాలతీలతా నాట్యమాడిందీ..
సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...
మాటామంతి లేని వేణువు పాట పాడిందీ..
ఆహా..ఆహా....ఓహో... ఓహో..
చరణం 1:
పూసే వసంతాలు మా కళ్ళలో
పూలే తలంబ్రాలు మా పెళ్లిలో
పూసే వసంతాలు మా కళ్ళలో
పూలే తలంబ్రాలు మా పెళ్లిలో
విరికొమ్మా చిరురెమ్మా..
విరికొమ్మా చిరురెమ్మా..
పేరంటానికి రారమ్మా
సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ...
మాటామంతి లేని వేణువు పాట పాడిందీ..
ఆహా..ఆహా...
హా..హా..హా...ఆ...హా...హా...
చరణం 2:
కలలే నిజాలాయే ఈనాటికీ
అలలే స్వరాలాయే మా పాటకీ
కలలే నిజాలాయే ఈనాటికీ
అలలే స్వరాలాయే మా పాటకీ
శ్రీరస్తూ శుభమస్తూ...
శ్రీరస్తూ శుభమస్తూ
అని మీరు మీరు దీవించాలీ
సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ..
నాదే గెలుపని మాలతీలతా నాట్యమాడిందీ..
సన్నజాజికి గున్నమావికి పెళ్లి కుదిరిందీ
Sunday, July 20, 2014
తెల్లావారక ముందే పల్లె లేచింది
చిత్రం : ముత్యాల పల్లకి (1976)
సంగీతం : సత్యం
గీతరచయిత : మల్లెమాల
నేపథ్య గానం : సుశీల
పల్లవి:
తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టీ లేపింది
ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
అదిరిపడి మేల్కోంది... అదే పనిగ కూసింది
తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది
చరణం 1:
వెలుగు దుస్తులేసుకొని సూరీడు
తూర్పు తలపు తోసుకొని వచ్చాడు
పాడు చీకటికి ఎంత భయమేసిందో
పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది
అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి
ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి
తెల్లావారక ముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది
చరణం 2:
పాలావెల్లిలాంటి మనుషులు
పండు వెన్నెల వంటి మనసులు
మల్లేపూల రాశివంటి మమతలు
పల్లేసీమలో కోకొల్లలు
అనురాగం... అభిమానం..
అనురాగం... అభిమానం.. కవలపిల్లలూ
ఆ పిల్లలకు పల్లేటూర్లు కన్నతల్లులు
తెల్లావారకముందే పల్లె లేచింది
తనవారినందరినీ తట్టి లేపింది
Subscribe to:
Posts (Atom)