Monday, July 14, 2014

ఓరబ్బి ఓరబ్బీ బంగారు మావా

చిత్రం : నిప్పులాంటి మనిషి (1974)

సంగీతం : సత్యం  

గీతరచయిత : ఆరుద్ర  

నేపథ్య గానం : జానకి, బాలు  

పల్లవి :

ఓరబ్బి ఓరబ్బీ బంగారు మావా... ఓరంతా పొద్దు ఉండగ రారా 

కోసికాసి కన్ను వాసెరా...ఓరీ నీయమ్మ కొడుకా

కండ్లనీరు రొండ్లకొచ్చేరా... కండ్లనీరు రొండ్లకొచ్చేరా

ఓలమ్మి ఓలమ్మిబంగారు చిలక... ఓరంతపొద్దు ఉండంగా వస్తే

ఆ సిగ్గుతో ముడుసుకపోదామే... ఓరి నీ అమ్మ కూతురా

చెంపలే కెంపులవుతాయే... నీ చెంపలే కెంపులవుతాయే

చరణం 1 :

పొగరుమోతు వయసు నాది... లగరు వగరు వలపునాది

పొంకమంత  పొంగుతుందిరా... ఓరినీ పొందులోన లోంగదీయరా

నీ వారు నీకు...అహా 

నా వారు నాకు...  అహా

నీ వారు నీకు... నా వారు నాకు 

లేనే లేరు...  సైరా సైరా సైరా

ఓరబ్బి ఓరబ్బీ బంగారు మావా... ఓరంతా పొద్దు ఉండగ రారా 

కోసికాసి కన్ను వాసెరా...ఓరీ నీయమ్మ కొడుకా

కండ్లనీరు రొండ్లకొచ్చేరా... కండ్లనీరు రొండ్లకొచ్చేరా

చరణం 2 : 

జబ్బ మీది పయట జారే... దబ్బ పండు చాయ మెరిసే

అబ్బతోడు మనసు నిలవదే... నా ఆశతీరా ఊసులాడవే

చిల్లంగి కళ్ళు... అహా 

చిగురాకు ఒళ్ళు...అహా

చిల్లంగి కళ్ళు చిగురాకు ఒళ్ళు

సిరిమల్లె సెండు నీవే నీవే నీవే

ఓలమ్మి ఓలమ్మిబంగారు చిలక... ఓరంతపొద్దు ఉండంగా వస్తే

ఆ సిగ్గుతో ముడుసుకపోదామే... ఓరి నీ అమ్మ కూతురా

చెంపలే కెంపులవుతాయే... నీ చెంపలే కెంపులవుతాయే

ఓరబ్బి ఓరబ్బీ బంగారు మావా... ఓరంతా పొద్దు ఉండగ రారా 

కోసికాసి కన్ను వాసెరా...ఓరీ నీయమ్మ కొడుకా

కండ్లనీరు రొండ్లకొచ్చేరా... కండ్లనీరు రొండ్లకొచ్చేరా

No comments:

Post a Comment