Tuesday, July 8, 2014

సుధా.. రాగ సుధా

చిత్రం :  ముత్తైదువ (1979)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు



పల్లవి:


సుధా.. రాగ సుధా.. అనురాగ సుధ..
నీ పేరు సుధ.. నీ రూపు సుధ...
నీ పెదవి సుధ... నీ పలుకు సుధ ...
నీ తలపు సుధా..ఆ.... కాస్త తెలుపు సుధ




చరణం 1:


పాల కడలిలో పుట్టిన సుధవో..
నీలి నింగిలో వెలిగే సుధవో ...
పూల గుండెలో పొంగే సుధవో..
పూర్వ జన్మ అందించిన సుధవో...
కాస్త తెలుపు సుధ...


సుధా.. రాగ సుధా ..



చరణం 2:


అరుణారుణ రాగం నీ.... వదనంలో కుంకుమ తిలకం...
అరుణారుణ రాగం నీ.... వదనంలో కుంకుమ తిలకం..
చెరిపేస్తే చెరగని ఆ సౌభాగ్యం.. చిరంజీవి కావడమే నా భాగ్యం ..

సుధా.. రాగ సుధా ..



చరణం 3:


కోవెలలో అగుపించిన దేవతవు... నా దేవతవై నను కోవెల చేశావు ...
కోవెలలో అగుపించిన దేవతవు... నా దేవతవై నను కోవెల చేశావు ..
గుడిలో మ్రోగే మంగళవాద్యం.. నీ మెడలో కాగల మంగళసూత్రం ..


సుధా.. రాగ సుధా.. అనురాగ సుధ..
నీ పేరు సుధ... నీ రూపు సుధ
నీ పెదవి సుధ... నీ పలుకు సుధ
నీ తలపు సుధా..ఆ .. కాస్త తెలుపు సుధ
సుధా.. రాగ సుధా..



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3164

No comments:

Post a Comment