Tuesday, July 8, 2014

ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో

చిత్రం :  ముత్యమంత ముద్దు (1989)
సంగీతం : హంసలేఖ
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి



పల్లవి:


ఇచ్చుకో .. ముద్దిచ్చి పుచ్చుకో
ముత్యమంత ముద్దు ఇచ్చుకో .. ముద్దబంతి లాగ విచ్చుకో
ఇచ్చుకో.. ముద్దిచ్చి పుచ్చుకో
ముత్యమంత ముద్దు ఇచ్చుకో .. ముద్దబంతి పూలు దోచుకో
సంగతేమిటో .. దొంగలించుకో .. బెంగ ఎందుకో..


ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో ..
ముత్యమంత ముద్దు ఇచ్చుకో ..
ముద్దబంతి లాగ విచ్చుకో...


చరణం 1:


నీ కన్నూ గీటినప్పుడే సిరివెన్నెలాయే
నీ గాలీ సోకినప్పుడే సన్నజాజీ పూసే .. విరబూసే
చిరుముద్దూ పెట్టినప్పుడే సిరిమువ్వా మోగే
నీ చేయీ తాకినప్పుడే జడకొంగూ జారే ..
చలితీరేచిలిపి వలపు చిలక పలికితేకలికి చిలక అలక తీరదా
పెదవి పెదవి అదిమినంతనే
మరుల మధువు పొరలి పొంగనీ నాలో...
వసంతమే ఊరేగీ వచ్చేటీ వయసులలో


ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో ..
ముత్యమంత ముద్దు ఇచ్చుకో ..
ముద్దబంతి లాగ విచ్చుకో



చరణం 2:


నీ లేఖా అందినప్పుడే మొదలాయే మోహం
నీ రేఖా దాటినప్పుడే శృతిమించే దాహం .. నీ స్నేహం
నీ జంటా చేరినప్పుడే బ్రతుకాయే బంధం
నీ ఒళ్ళో వాలినప్పుడే దొరికిందీ స్వర్గం .. నీ సర్వం
కనులు కలిసి కలలు మరిగితి
వెలుగు తగిలి వలపు పండగా
తనువు తనువు అదుపు తప్పితే
మనసులడుగు మనువుజరిగెనే నాలో...
సరాగమే సంగీత గంధాలూ చిలకగనే..


ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో ..
ముత్యమంత ముద్దు ఇచ్చుకో ..
ముద్దబంతి లాగ విచ్చుకో..


No comments:

Post a Comment