Wednesday, August 20, 2014

కుంకుమ పూసిన ఆకాశంలో

చిత్రం :  రాగదీపం (1982)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


కుంకుమ పూసిన ఆకాశంలో ప్రణయ సంధ్యా రాగాలు
కుంకుమ పూసిన ఆకాశంలో ప్రణయ సంధ్యా రాగాలు
అవి మౌన గీతాలై.. చెలి మందహాసాలై...
నా కోసం విరిసిన కుసుమాలు


కుంకుమ కోరిన అనురాగంలో ఉదయ సంధ్యా రాగాలు
కుంకుమ కోరిన అనురాగంలో ఉదయ సంధ్యా రాగాలు
అవి మధుర భావాలై.. మన ప్రణయ గీతాలై...
నా సిగలో విరిసిన కుసుమాలు



చరణం 1:


ఎదలే..తుమ్మెదలై.. వినిపించే ఝంకారం
పెదవులు త్వరపడితే వలపుల శ్రీకారం


కనులే.. కౌగిలులై.. కలిసే సంసారం
పరువపు ఉరవడిలో.. మనసులు ముడిపడుతూ
తొలిసారి కలిసెను ప్రాణాలు.. చెలికాయి జీవన దాహాలు 


కుంకుమ పూసిన ఆకాశంలో ప్రణయ సంధ్యా రాగాలు
అవి మధుర భావాలై.. మన ప్రణయ గీతాలై...
నా సిగలో విరిసిన కుసుమాలు



చరణం 2:


కలలే..కలయికలై..చిగురించే శృంగారం
ప్రేమకు గుడి కడితే.. మన ఇల్లే ప్రాకారం


మనసే.. మందిరమై.. పలికే ఓంకారం
వలపుల తొలకరిలో.. తనువులు ఒకటౌతూ...
తొలిసారి పలికెను రాగాలు.. మనసార మధుర సరాగాలు 


కుంకుమ కోరిన అనురాగంలో ఉదయ సంధ్యా రాగాలు

అవి మౌన గీతాలై.. చెలి మందహాసాలై...
నాకోసం విరిసిన కుసుమాలు





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1880

No comments:

Post a Comment