Monday, August 25, 2014

నా హృదయమా

చిత్రం :  ప్రియ (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం :  బాలు, సుశీల, జానకి   


పల్లవి :


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..


నా హృదయమా .. నా హృదయ ఉదయ రాగమా

మాయనీ... తీయనీ... మధుర గీతి పాడుమా



చరణం 1 :


అందమై... మకరందమై

మందబంధ మలయానిత గంధమై

మదనుని విరివిల్లున అరవిందమై

ఎలతేటి ఎద మీటు ఆనందమై.. ఎలతేటి ఎద మీటు ఆనందమై..

పులకరించు కుసుమమా.. పులకరించు కుసుమమా


నా హృదయమా .. నా హృదయ ఉదయ రాగమా


చరణం 2 :


ఆటవై.. సయ్యాటవై..

చిలిపి వలపులాడే చెరలాటవై...

తలపుల తత్తరలో తచ్చాటవై..

పరువాల సరదాల బూచాటవై..పరువాల సరదాల బూచాటవై..

కరిగిపోవు స్వప్నమా.. కరిగిపోవు స్వప్నమా..



నా హృదయమా... నా హృదయ ఉదయ రాగమా

మాయనీ.. తీయనీ... మధుర గీతి పాడుమా


చరణం 3 :


వాణివై…  వర వీణవై

బృందావన సమ్మోహన వేణువై

పదకవిత మృదుభాషల బాణివై

అనురాగ రాగాల నెరజాణవై... అనురాగ రాగాల నెరజాణవై..

గానమైన మౌనమా.. గానమైన మౌనమా..  


గాలివై.. చిరుగాలివై

సిరిమల్లెల చిరుజల్లుల వేళవై

కనుసన్నల తెలివెన్నెల జాలువై

జోజోల ఉయ్యాల జంపాలవై... జోజోల ఉయ్యాల జంపాలవై...

సేదదీర్చు నేస్తమా.. సేదదీర్చు నేస్తమా..



నా హృదయమా…  నా హృదయ ఉదయ రాగమా

మాయనీ.. తీయనీ.. మధుర గీతి పాడుమా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9306

No comments:

Post a Comment