Monday, August 25, 2014

మావయ్య వస్తాడంట

చిత్రం :  రామచిలక (1978)
సంగీతం : సత్యం
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  జానకి 


పల్లవి :


లాలిలాలో..ఓఓఓ..లాలిలాలో..ఓ..ఓ..
లలిలాలిలాలో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..


నా మావయ్య.. వస్తాడంట..
మావయ్య వస్తాడంట.. మనసిచ్చి పోతాడంటా
మావయ్య వస్తాడంట.. మనసిచ్చి పోతాడంటా
మరదల్ని మెచ్చీ.. మరుమల్లె గుచ్చీ
ముద్దిచ్చి పోతాడంటా.. ఆ ముద్దర్లు పోయేదెట్టా


నా బుగ్గలే ఎరుపెక్కెనే..
మొగ్గేసినా నును సిగ్గులు..
ఆ..మొగ్గేసినా తొలిసిగ్గులు..
పడుచోడు నవ్వాడంట... పగలంత ఎన్నెల్లంట
వలపల్లె వచ్చి.. వరదల్లె ముంచి..
వాటేసుకొంటాడంటా.. ఆడ్ని పైటేసుకొంటానంట


మావయ్య వస్తాడంట.. మనసిచ్చిపోతాడంట 


చరణం 1 :


కల్లోకి వచ్చీ.. కన్ను కొట్టాడే..
కన్నె గుండెల్లో.. చిచ్చు పెట్టాడే..
కల్లోకి వచ్చీ..  కన్ను కొట్టాడే..
కన్నె గుండెల్లో.. చిచ్చుపెట్టాడే..


గుండెల్లో వాడు  ఎండల్లు కాసే.. కన్నుల్లో నేడు ఎన్నెల్లు కురిసే..
వన్నెల్లు తడిసే.. మేనేల్ల మెరిసే ..
పరువాలే పందిళ్ళంట.. కవ్వించే కౌగిళ్ళంట..
మురిసింది ఒళ్ళు.. ఆ మూడుముళ్ళూ..
ఎన్నాళ్ళకేస్తాడంటా.. ఇంకెన్నాళ్ళకొస్తాడంట..


మావయ్య వస్తాడంట.. మనసిచ్చి పోతాడంట.. 


చరణం 2 :


కళ్యాణ వేళా.. సన్నాయి మోగ..
కన్నె అందాలే.. కట్నాలు కాగా
కళ్యాణ వేళా.. సన్నాయి మోగ..
కన్నె అందాలే.. కట్నాలు కాగా
మనసిచ్చినోడు.. మనువాడగానే..
గోరింక నీడ.. ఈ చిలకమ్మ పాడే..
చిలకమ్మ పాడే.. చిలకమ్మ పాడే ...


ఇంటల్లుడౌతాడంట.. ఇంక నా ఇల్లు వాడేనంటా..
ఇంటల్లుడౌతాడంట.. ఇంక నా ఇల్లు వాడేనంటా..
మదిలోని వాడూ.. గదిలోకి వస్తే..
కన్నీరు రావాలంటా.. అదే పన్నీరై పోవాలంటా ..
కన్నీరు రావాలంటా.. అదే పన్నీరై పోవాలంట..




2 comments:

  1. The music director is incorrectly printed as Chakravarthi. But the "Satyam" is it's music. Please fix. Thanks, - Prasad Kommaraju

    ReplyDelete