Wednesday, August 20, 2014

సడి సెయకో గాలీ

చిత్రం : రాజమకుటం ( 1961)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :  పి. లీల 



పల్లవి :


సడి సెయకో గాలీ సడి సేయబోకే
సడి సెయకో గాలీ సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవ్వలించేనే


చరణం 1:


రత్నపీఠిక లేని రారాజు నా స్వామీ
మణి కిరీటము లేని మహరాజు గాకేమీ
చిలిపి పరుగుల మానీ కొలిచి పోరాదే


సడి సేయకే... 


చరణం 2:


ఏటి గలగలలకే ఎగసి లేచేనే
ఆకు కదలికలకే అదరి చూచేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే


సడి సేయకే... 


చరణం 3:


పండు వెన్నెలనడిగి పాన్పు తేరాదే
క్రీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
విరుల వీవెన బూని విసిరిపోరాదే


సడి సెయకో గాలీ సడి సేయబోకే
సడి సెయకో గాలీ సడి సేయబోకే
బడలి ఒడిలో రాజు పవ్వలించేనే...


సడి సెయకో గాలీ...
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఊ..ఊ..ఊ..ఊ..ఊ...

No comments:

Post a Comment