చిత్రం : రాజమకుటం ( 1961) సంగీతం : మాస్టర్ వేణు నేపధ్య గానం : పి. లీల
పల్లవి :
ఓహొహొహో.. ఓహొహొహో..హోయ్ ఏడనున్నాడో ఎక్కడున్నాడో..
చూడ చక్కని చుక్కల ఱేడు.. ఈడు జోడు కలిసినవాడు ఏడనున్నాడో ఎక్కడున్నాడో.. నా చుక్కల ఱేడు.. ఏడనున్నాడో ఎక్కడున్నాడో.. హేయ్..
చరణం 1:
ఓహొహొహో.. ఓహొహొహో..
గాలి రెక్కల పక్షుల్లారా..ఆ.. గాలి రెక్కల పక్షుల్లారా.. పాల వన్నెల మబ్బుల్లారా..ఓ.. ఓ.. ఓ.. గాలి రెక్కల పక్షుల్లారా.. పాల వన్నెల మబ్బుల్లారా పక్షుల్లారా.. మబ్బుల్లారా.. మనసు చూరగొని మాయమైన మక్కువ ఱేడే..
ఏడనున్నాడో ఎక్కడున్నాడో... నా చుక్కల ఱేడు.. ఏడనున్నాడో ఎక్కడున్నాడో హేయ్..
No comments:
Post a Comment