Friday, August 8, 2014

కొమ్మలో కూసింది ఓ కోయిలా

చిత్రం : కొత్త పెళ్ళికూతురు (1985)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం : బాలు,  సుశీల


పల్లవి :


కొమ్మలో కూసింది ఓ కోయిలా

కొమరాకు గమకాల సన్నాయిలా


ఏమని... ఏమేమనీ

ఏమని... ఏమేమనీ


వేళ ఆమని.. వేగ రమ్మని

వేళ ఆమని.. వేగ రమ్మని

ఎదల మెదలు తుమ్మెదల రోదలతో

జతులు కలిపి నా జతకు రమ్మనీ...


కొమ్మలో కూసింది ఓ కోయిలా..

కొమరాకు గమకాల సన్నాయిలా.. సన్నాయిలా


చరణం 1 :


నీ కబరి.. నీలాంబరి వర్ణమై  

నీ కళలే.. కావ్యానికి శిల్పమై

నీ పిలుపే.. గీతానికి నాదమై

నీ పలుకే.. నాట్యానికి వేదమై

నువ్వే నా ఇష్ట సఖివై.. నడిచే ఓ అష్టపదివై

నువ్వే నా ఇష్ట సఖివై.. నడిచే ఓ అష్టపదివై

ఊపిరలా.. ఉప్పెనలా.. ఎగసిన ఈ శుభవేళా


కొమ్మలో కూసింది ఓ కోయిలా

కొమరాకు గమకాల సన్నాయిలా.. సన్నాయిలా


చరణం 2 :


నీ లయలే.. అందానికి లాస్యమై

అందియలే.. తాళానికి భాష్యమై

నా బ్రతుకే నాదానికి దాస్యమై

నా పదమే.. పాదానికి నృత్యమై

నీ పాటే హంస గీతమై.. చిరునవ్వే చైత్ర మాసమై

నీ పాటే హంస గీతమై.. చిరునవ్వే చైత్ర మాసమై

తేనియలా వెల్లువలా.. ఎగసిన నా పల్లవిలా


కొమ్మలో కూసింది ఓ కోయిలా

కొమరాకు గమకాల సన్నాయిలా.. సన్నాయిలా


ఏమని.. ఏమేమనీ

ఏమని.. ఏమేమనీ


వేళ ఆమని.. వేగ రమ్మని

వేళ ఆమని.. వేగ రమ్మని

ఎదల మెదలు తుమ్మెదల రోదలతో

జతులు కలిపి నా జతకు రమ్మనీ...

కొమ్మలో కూసింది ఓ కోయిలా

కొమరాకు గమకాల సన్నాయిలా.. సన్నాయిలా

 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=5101 

No comments:

Post a Comment