Friday, August 22, 2014

నీ వలపే బృందావనం

చిత్రం :  రాధాకృష్ణ (1978)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


రాధా......! కృష్ణా.......!

నీ వలపే బృందావనం.... నీ పిలుపే మురళీ రవం

నీలి గగనాలలో...  తేలి ఆడాలిలే


నీ వలపే బృందావనం... నీ పిలుపే మురళీ రవం

నీలి కెరటాలలో... తేలి ఊగాలిలే


చరణం 1:


కొంటె కృష్ణుని కులుకు చూపులో.. కళ్యాణ కాంతులు మెరిసాయిలే

కొంటె కృష్ణుని కులుకు చూపులో.. కళ్యాణ కాంతులు మెరిశాయిలే


నా రాధ నడతలో ఈ వేళా.. నవ వధువు తడబాటు కలిగించెలే

రంగైన వజ్రాల పందిరిలో.. రతనాల తలంబ్రాలు కురిసేనులే

రతనాల తలంబ్రాలు కురిసేనులే .. 

రాధా......! కృష్ణా.......!


చరణం 2:


రాధా కృష్ణుల అనురాగాలు.. మనలో రాగాలు నిలపాలిలే

రాధా కృష్ణుల అనురాగాలు.. మనలో రాగాలు నిలపాలిలే


నీవు నేనూ జీవితమంతా.. నవరాగ గీతాలు పాడాలిలే

మన హృదయాలు పూల నావలో.. మధుర తీరాలు చేరాలిలే

మధుర తీరాలు చేరాలిలే..


రాధా......! కృష్ణా.......!



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2513

No comments:

Post a Comment