Thursday, September 18, 2014

తుమ్మెద ఓ తుమ్మెద

చిత్రం :  శ్రీనివాస కల్యాణం (1987)
సంగీతం :  కె.వి. మహదేవన్
నేపధ్య గానం :  బాలు, సుశీల

పల్లవి :

తుమ్మెద ఓ తుమ్మెద... ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెద
తుమ్మెద ఓ తుమ్మెద.. ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెద

మగడు లేని వేళ తుమ్మెద.. వచ్చి మొహమాట పెడతాదే తుమ్మెద
మాటవరసకంటు తుమ్మెద.. పచ్చి మోట సరసమాడె తుమ్మెద

అత్త ఎదురుగానే తుమ్మెద.. రెచ్చి హత్తుకోబోయాడు తుమ్మెద

చరణం 1 : 

ఎదురుపడితే కదలనీక దడికడతాడే.. పొదచాటుకి పదపదమని సొదపెడతాడే

ఒప్పనంటే వదలడమ్మ.. ముప్పు తప్పదంటే బెదరడమ్మ

చుట్టుపక్కలేమాత్రం చూడని ఆత్రం
పట్టువిడుపులేనిదమ్మ కృష్ణుని పంతం

మగడు లేని వేళ తుమ్మెద.. వచ్చి మొహమాట పెడతాదే తుమ్మెద
మాటవరసకంటు తుమ్మెద.. పచ్చి మోట సరసమాడె తుమ్మెద
అత్త ఎదురుగానే తుమ్మెద.. రెచ్చి హత్తుకోబోయాడు తుమ్మెద
తుమ్మెద.. ఓ తుమ్మెద... ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెద.. 
తుమ్మెద.. తుమ్మెద

చరణం 2 : 

తానమాడువేళ తాను దిగపడతాడే.. మానుమాటు చేసి చూడ ఎగపడతాడే

చెప్పుకుంటే సిగ్గుచేటు.. అబ్బ నిప్పులాంటి చూపు కాటు

ఆదమరచి వున్నావా కోకలు మాయం..
ఆనక ఏమనుకున్నా రాదే సాయం..

మగడు లేని వేళ తుమ్మెద.. వచ్చి మొహమాట పెడతాదే తుమ్మెద
మాటవరసకంటు తుమ్మెద.. పచ్చి మోట సరసమాడె తుమ్మెద
అత్త ఎదురుగానే తుమ్మెద.. రెచ్చి హత్తుకోబోయాడు తుమ్మెద

తుమ్మెద.. ఓ తుమ్మెద.. ఎంత తుంటరోడె గోవిందుడు తుమ్మెద

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11058

No comments:

Post a Comment