Friday, September 5, 2014

ఓ చంద్రమా ఒకనాటి ప్రియతమా

చిత్రం :  విచిత్ర జీవితం (1978)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  సుశీల  


పల్లవి :


ఓ చంద్రమా... ఒకనాటి ప్రియతమా
ఓ చంద్రమా... ఒకనాటి ప్రియతమా
ఓ చంద్రమా... ఒకనాటి ప్రియతమా
ఈ పేద కలువా నీకు గురుతేనా.... తెలుపుమా...
ఓ చంద్రమా... ఒకనాటి ప్రియతమా...



చరణం 1 :


నీవు నాకు చెసిన బాస... నీటిమీద వ్రాసిన రాతా
నీవు నాకు చెసిన బాస... నీటిమీద వ్రాసిన రాతా
తాళి కట్టిన కలువ కన్నా.. తళుకులొలికె తార మిన్నా
రోజు మారే రుపం నీది... రోజు మారే రుపం నీది
మోజు పడినా పాపం నాది.....
ఓ చంద్రమా.... ఒకనాటి ప్రియతమా...



చరణం 2 :


కళలు మార్చి కలలే చెరిపి.. మనువు మర్చి మంటలు రేపి..
కళలు మార్చి కలలే చెరిపి... మనువు మర్చి మంటలు రేపి..
మచ్చపడిన సొగసు నీది... చిచ్చు రేగిన మనసు నాది ...


కట్టగలవూ మెడకో తాడు... కట్టగలవూ మెడకో తాడు
కన్నెవలుపుకే ఉరితాడు....


ఓ చంద్రమా... ఒకనాటి ప్రియతమా
ఈ పేద కలువా నీకు గురుతేనా.... తెలుపుమా...
ఓ చంద్రమా... ఒకనాటి ప్రియతమా...



No comments:

Post a Comment