Friday, September 5, 2014

ఆడవే జలకమ్ములాడవే

చిత్రం :  విచిత్ర కుటుంబం (1969)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 



పల్లవి :


ఆడవే..ఆడవే ..ఆడవే జలకమ్ములాడవే
ఆడవే జలకమ్ములాడవే ....
కలహంస లాగా జలకన్య లాగా..కలహంస లాగా జలకన్య లాగా
ఆడవే......ఆడవే 


చరణం 1 :


ఆదికవి నన్నయ్య అవతరించిన నేల...
ఆ..ఆ..ఆ...
తెలుగు భారతి అందియలు పల్కె ఈ నేల ..
ఆంధ్రసంస్కృతికి తీయని క్షీరధారలై...
జీవకళలొల్కు గోదావరి తరంగాల ఆడవే..ఆడవే..ఏ... 



చరణం 2 :


నాగార్జునుని భోధనలు ఫలించిన చోట
ఆ..ఆ..ఆ..
బౌద్ధమతవృక్షంబు పల్లవించిన చోట...


బుద్ధం శరణం గఛ్చామి...
ధర్మం శరణం గఛ్చామి...
సంఘం శరణం గఛ్చామి...


కృష్ణవేణి తరంగిణి జాలిగుండెయె సాగరమ్మై...
రూపు సవరించుకొను నీట...
ఆడవే ... ఆడవే....



చరణం 3 :


కత్తులును ఘంటములు ...కదను త్రొక్కినవిచట...
కత్తులును ఘంటములు ...కదను త్రొక్కినవిచట
అంగళ్ళ రతనాలు ...అమ్మినారట యిచట
నాటి రాయల పేరు నేటికిని తలపోయు
తుంగభద్రానదీ తోయమాలికలందు....
ఆడవే ...ఆడవే..


ఆడవే..ఆడవే ..ఆడవే జలకమ్ములాడవే
ఆడవే జలకమ్ములాడవే ..


No comments:

Post a Comment