Friday, September 19, 2014

రాకోయీ అనుకోని అతిథి

చిత్రం :  శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్   (1976)
సంగీతం :  పెండ్యాల  
గీతరచయిత :  దేవులపల్లి
నేపధ్య గానం :  బాలు    



పల్లవి :


రాకోయీ అనుకోని అతిథి
కాకి చేత కబురైనా పంపక
రాకోయీ అనుకోని అతిథి


వాకిటి తలుపులు తెరువనె లేదు
ముంగిట ముగ్గులా తీర్చనే లేదు
వేళ కాని వేళా .....
ఈ వేళ కాని వేళ ..... ఇంటికి


రాకోయీ అనుకోని అతిథి
రాకోయీ ..... 



చరణం 1 :



సిగలో పూవులు ముడవాలంటే ..... సిరిమల్లెలు వికసింపనె లేదు
కన్నుల కాటుక దిద్దాలంటే ..... నిద్దుర నీడలా వీడనే లేదు
పాలు వెన్నలు తేనే లేదు ..... పంచభక్ష్యముల చేయనే లేదు


వేళ కాని వేళా ..... ఈ వేళ కాని వేళ ..... విందుకు

రాకోయీ అనుకోని అతిథి... రాకోయీ ..... 


చరణం 2 :



ఊరక దారినె పోతూ పోతూ అలసి వచ్చితివో?
ఒంటరిగా ఉన్నానని నే తెలిసే వచ్చితివో?
ఒంటరిగా ఉన్నానని నే తెలిసే వచ్చితివో?
రమ్మనుటకు సాహసము చాలదు...
పొమ్మనుటా మరియాద కాదది...


వేళ కాని వేళా .....ఈ వేళ కాని వేళ ..... త్వరపడి
రాకోయీ అనుకోని అతిథి... కాకి చేత కబురైన పంపక
రాకోయీ అనుకోను అతిథి...
రాకోయీ ..... 




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=3089

No comments:

Post a Comment