Saturday, September 13, 2014

నటనం ఆడెనే

చిత్రం :  శుభోదయం (1980)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల   

పల్లవి :

తా..తకజం తకజం తరికిటతక
తత్తకజం తకజం తరికిటతక
తాతకజం తరికిటతక తత్తకజం తరికిటతక

తాతకజం తత్తకజం తజం తజం తరికిట తక
తాతత్తకజం తజం తజం తరికిటతక
తాతకజం తకజం తకజం తరికిటతక
తత్తరిత్తధిమితద్దిమ తక్కిట
తక్కిట తఝుణు తరిగిడ తరిగిడ తోం
తత్తరిత్తధిమితద్దిమి తక్కిట తక్కిట
తఝుణు తరిగిడ తరిగిడతోం

తకతరిత్తధిమి తరిగిడ తరిగిడతోం
తరిగిడ తరిగిడతోం తరిగిడ తరిగిడ
తరిగిటతక తరిగిటతక - తత్తరికిట
తత్తరి తఝుణు తళాంగుతోంకిట తరిగిటతోం
తత్తరి తఝణు తళాంగుతోం కిట తరిగిట తోం

నటనం ఆడెనే...
నటనం ఆడెనే... భవ తిమిరహంశుడా పరమ శివుడు
నటకావతంశుడై తక ధిమి తక యని
నటనం ఆడెనే... భవ తిమిరహంశుడా పరమ శివుడు
నటకావతంశుడై తక ధిమి తక యని
నటనం ఆడెనే...

చరణం 1 :

ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల.. ఎండ వెన్నెలై వెల్లువైనటుల
నిటాలాక్షుడే తుషారాద్రి విడి విశాలాక్షితో తాళ లయగతుల
నటనం ఆడెనే...  

ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల.. ఎండ వెన్నెలై వెల్లువైనటుల
ఎనిమిది దిక్కులు ఒక్కటైనటుల.. ఎండ వెన్నెలై వెల్లువైనటుల
నిటాలాక్షుడే తుషారాద్రి విడి విశాలాక్షితో తాళ లయగతుల
నటనం ఆడెనే...  

చరణం 2 :

శివగంగ శివమెత్తి పొంగగా... నెలవంక సిగపూవు నవ్వగా
హరిహరాత్మకం అగుచూ అఖిల ప్రపంచమ్ము
గరుడనాదానంద కావ్యమై వరలగా
నటనం ఆడెనే..  ఆడెనే... ఆడెనే

శివగంగ శివమెత్తి పొంగగా... నెలవంక సిగపూవు నవ్వగా
శివగంగ శివమెత్తి పొంగగా... నెలవంక సిగపూవు నవ్వగా

హరిహరాత్మకం అగుచూ అఖిల ప్రపంచమ్ము
హరిహరాత్మకం అగుచూ అఖిల ప్రపంచమ్ము
గరుడనాగానంద కావ్యమై వరలగా
నటనం ఆడెనే..  ఆడెనే... ఆడెనే

చరణం 3 :

వసుధ వసంతాలాలపించగా.. సురలు సుధను ధరలో కురిపించగా
వసుధ వసంతాలాలపించగా.. సురలు సుధను ధరలో కురిపించగా
రతీ మన్మధులు కుమార సంభవ.. శుభోదయానికి నాంది పలుకగా
రతీ మన్మధులు కుమార సంభవ.. శుభోదయానికి నాంది పలుకగా

నటనం ఆడెనే.. భవ తిమిర హంశుడా పరమశివుడు
నటకావతంశుడై తక ధిమి తక యని
నటనం ఆడెనే....
భవ తిమిర హంశుడీ పరమశివుడు
నటకావతంశుడై తక ధిమి తకయని
నటనం ఆడెనే... 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5114

No comments:

Post a Comment